కెసిఆర్ సార్ అమ్మ నాన్న లేని అనాథలం మాకూడ దళిత బంధు ఇవ్వండి
దళితుల కొరకు కెసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం తమకి కేటాయించాలని వంగూరి దివ్య వంగూరి సంధ్య అనే ఇద్దరు అక్కచెల్లెళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరం పంపారు
సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు గ్రామానికి చెందిన వంగూరి సంధ్య (20) మరియు వంగూరి దివ్య (19) SC(మాదిగ) అనే ఇద్దరు అనాథ అక్క చెల్లెలు 20 సంవత్సరాల లోపు వయసు వారే. ఒకరేమో ఇంటర్ పూర్తి చేసినారు.మరొకరు డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నరు. వాళ్లు 8 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు తల్లి వంగూరి రేణుక రొమ్ము క్యాన్సర్ తో చనిపోయింది. దాని తరవాత కొద్ది కాలానికే తండ్రి వంగూరి కిష్టయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితం అయ్యాడు.
ఆయన అలన పాలన ఈ ఇద్దరు పిల్లలే చూసుకుంటూ ఇద్దరు చదువుకుంటూ కులిపనులు పనులు చేస్తూనే ఇంతకాలం తండ్రిని సాదుకుంటు వచ్చారు. నెల రోజుల క్రితం(06 ఆగస్ట్ 2023) నాడు తండ్రి కూడా చనిపోయాడు. ఇలా తాము ఇంత చిన్న వయసులోనే తల్లిదడ్రులిద్దరూ చనిపోవటం ఆ పిల్లలు తట్టుకోలేకపోతున్నారు.చివరికి తండ్రి అంత్యక్రియలు కూడా సొంత ఖర్చులతో జరపాలేని పేదరికం లో ఉన్న ఆ అక్క చెల్లెలకి మానవత్వం ఉన్న కొంత మంది అండగా నిలిచి కొంత ఆర్థిక సహకారం అందించటం తో తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇప్పుడు తమకి ఎవరు లేక ఒంటరిగా మిగిలిపోయామని బోరున విలపిస్తున్నారు.తమకి అస్తి పాస్తులు కూడా ఏమీ లేవని తమ మంచి చెడూ చూసుకునే వారు కూడా ఎవరూ లేకపోవడంతో అమ్మ నాన్న లేని ఇద్దరు అనాథలు అయిన ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ తమకు కేసిఆర్ ఏ పెద్దదిక్కు కావాలని తమ కాళ్లపై తాము నిలబడి బ్రతకడానికి,స్వయం ఉపాధినీ ఎంచుకొని తమ జీవనం కొనసాగించటానికి రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఎదుగుదల కొరకు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని తమకు ఒక యూనిట్ నీ కేటాయించి కెసీఆర్ గారే తమకు అండగా నిలవాలని కోరుకుంటూ బుధవారం రోజు తమ బాధని పోస్ట్ కార్డు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉత్తరం పంపారు.
ఎంతో మందికి దళిత బంధు పథకం ద్వారా సహాయపడి వారి బతుకుల్లో మార్పులు తీసుకొచ్చిన కెసిఆర్ అమ్మ నాన్న లేని తమకి కూడా దళిత బంధు పథకం ఇచ్చి అమ్మ నాన్న అన్ని తానే అయ్యి తమ బతుకుల్లో మార్పులు తీసుకురావాలని తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గారు కూడా స్పందించి తమ చెల్లెల లాగా అనుకొని మాపై మానవత్వం చూపి మాకు అన్నలాగ ఉండాలని ఆ పిల్లలు వేడుకుంటున్నారు.
Sep 13 2023, 19:38