హైదరాబాద్ అభివృద్ధి ట్రైలర్ మాత్రమే: కేటీఆర్
హైదరాబాద్ అభివృద్ధి ట్రైలర్ మాత్రమే
హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరిస్తున్నదని, రియ ల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు కూడా అన్ని వైపులకూ విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
రియల్ ఎస్టేట్ అంటే అమ్మకాలు, కొనుగోలు మాత్రమే కాదని, రాష్ట్రంలో ఈ రంగంపై దాదాపు 30 లక్షల మంది ఆధారపడ్డారని చెప్పారు.
విజన్‌తో కూడిన సినిమా ముందుంది
ఏ నగరమూ ఒక్కరోజులో నిర్మితం కాదు
నలుమూలలా విస్తరిస్తున్న మహానగరం
రియల్ పెట్టుబడులు నలువైపుల విస్తరించాలి
2050 దాకా తాగునీటికి ఢోకా లేదు
ప్రశాంతంగా శాంతి భద్రతల పరిస్థితి
అందుకే వెల్లువలా వస్తున్న పెట్టుబడులు
రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరిస్తున్నదని, రియ ల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు కూడా అన్ని వైపులకూ విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. రియల్ ఎస్టేట్ అంటే అమ్మకాలు, కొనుగోలు మాత్రమే కాదని, రాష్ట్రంలో ఈ రంగంపై దాదాపు 30 లక్షల మంది ఆధారపడ్డారని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర అభివృద్ధిపై మీరు చూసింది ట్రైలర్ మాత్రమే.. ఇంకా అనేక ప్రాజెక్టులతో, గొప్ప విజన్‌తో నగర అభివృద్ధి సినిమా ముందున్నదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నగరంలో శనివారం నిర్వహించిన టైమ్స్ మెగా ప్రాపర్టీ షోను కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో అతి తక్కువగా ఇండ్ల ధరలు ఉన్న నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నదని, ఈ ఒరవడిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టేందకు ప్రాధాన్యమివ్వాలని సూ చించారు. నగరంలో ఉన్న రియల్ ఎస్టేట్ బిల్డర్లు ప్రపంచస్థాయి ప్రమాణాలతో పోటీపడుతూ, వినూత్నమైన ఆకృతులతో అద్భుతమైన భవనాలను నిర్మించాలని కోరారు. ఆ భారీ భవనాలు హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెస్తాయన్న విషయాన్ని తమ డిజైన్ల రూపకల్పన సమయంలోనే పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. దేశంలో ముంబై తర్వాత అతి ఎత్తయిన భవనాలు కలిగిన నగరంగా హైదరాబాద్ నిలిచిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
ఒక్క రోజులో నగరాలు నిర్మాణం కావు
ఏ నగరమైనా ఒక రోజులో నిర్మాణం కా దని, ప్రభుత్వాలు, పాలకులు సరైన ప్రణాళికతో ముందుకు వెళితేనే నగరాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం కోటిమంది ఉన్న హైదరాబాద్ జనాభా మూడు కోట్లకు చేరుకున్నా, 2050 వరకు తాగునీటికి ధోకా లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వచ్చిన అద్భుతమైన మార్పులపై సినీ హీరో రజనీకాంత్ మొదలు అనేకమంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం హైదరాబాద్ అభివృద్ధిని ప్రత్యేకంగా తమ నివేదికల్లో పేర్కొంటున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే నగరంలో మౌలిక వసతుల కల్పన వేగంగా కొనసాగుతున్నదని, నగర ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతలు బాగుంటేనే భారీగా పెట్టుబడులు వస్తాయని అన్నారు.
Sep 10 2023, 10:03