కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి :ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్
తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 6 వ రోజు రిలే దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం ఆరో రోజు రోజు రిలే నిరాహార దీక్షలకు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మద్దతు ప్రకటించి మాట్లాడుతూ
విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని,మినిమం టైం స్కేల్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్షా ప్రాజెక్టు నందు జిల్లా, మండల, స్కూల్ కాంప్లెక్స్ , పాఠశాల స్థాయిలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, ఐఈఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, మేస్పెంజర్లు, పార్ట్ టైం ఇన్స్ ట్రక్టర్లు, కేజీబీవి యుఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లు, సిఆర్టీలు, పీఈటి, ఎఎన్ఎం, అకౌంటెంట్, కంప్యూటర్ టీచర్లు, ఒకేషనల్ ఇన్స్ ట్రక్టర్స్, వంటమనుషులు, వాచ్మెన్లు, అటెండర్లు మరియు కేజీబీవీ టైప్ -4 (మోడల్ స్కూల్ హస్టల్స్ లో పనిచేస్తున్న కేర్ టెకర్, ఎఎన్ఎం,కుక్స్,వాచ్ వమేన్స్ , జిల్లా స్థాయిలో ఎపిఓ, సిస్టమ్ ఎనలిస్ట్, డిఎల్ఎంటి , డాటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్ పర్సన్, ఆఫీస్ సబార్డినేటర్స్ గా వివిధ స్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సుప్రీ కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం( మినిమమ్)
టైమ్ స్కేల్ను ) అమలుచేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సమగ్ర శిక్షా, కెజిబివి, యుఆర్ఎస్ కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేలును అమలు చేసి ఉద్యోగాల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు.సమగ్ర శిక్షా, కెజిబివి యుఆర్ఎస్ ను విద్యాశాఖలో విలీనం చేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని,
సుప్రీకోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులందరికి మినిమమ్ టైమ్ స్కేలును (కనీస వేతనం) అమలు చేయాలన్నారు.
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రూప్ ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించి,నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలి (హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించాలని కొరారు.
విద్యాశాఖలో చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వేయిటేజ్ కల్పించి,
మరణించిన, గాయపడిన కాంట్రాక్టు ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు.
కరోనా సమయంలో పార్ట్ టైం ఇన్స్ ట్రక్టర్ల లకు 18 నెలల వేతన బకాయిలు చెల్లించాలని తెలిపారు.
Sep 09 2023, 22:58