అంగన్వాడీలను గుండెల్లో పెట్టుకుంది కేసీఆర్:మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రెటరీ జనరల్ జ్యోతి పద్మ
అంగన్వాడీలను గుండెల్లో పెట్టుకుంది కేసీఆర్
మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రెటరీ జనరల్ జ్యోతి పద్మ
ఈనెల 11వ తేదీ నుండి అంగన్వాడీల సమ్మెకు సంబంధించి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రెటరీ జనరల్ జ్యోతి పద్మ మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క అంగనవాడి టీచర్లు హెల్పర్లు సమ్మెలో భాగస్వామ్యం కావద్దని శాంతియుత పద్ధతులో సమస్యను పరిష్కరించుకోవాలి తప్పితే చిన్నారులను , గర్భిణీలను, బాలింతలను ఇబ్బంది పెట్టే ప్రక్రియకు చేపట్ట వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం అంగనవాడిలో చేసిన మేలు పై ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని పేర్కొన్నారు. అంగన్వాడి వర్కర్ నుండి టీచర్ అనే పదోన్నతిని దేశంలోనే మొట్టమొదటిసారిగా కల్పించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గత ప్రభుత్వాల ముఖ్యమంత్రి ల దీటుగా కేసీఆర్ ఇంటికి పిలిచి మరి సహపంక్తి భోజనం చేసి జీతాలు పెంచిన విషయం అంగన్వాడీలు మర్చిపోలేదని అని తెలియజేశారు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా వారికి పిఆర్సి పెరిగినప్పుడల్లా అంగన్వాడీలకు ముపై శాతం జీతం పెంచిన ఘనత కేసీఆర్ దేనని తెలిపారు. కరోనా సమయంలో అంగనవాడి సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి 20వేల రూపాయల మట్టి ఖర్చులు ఇచ్చిన ఘనత కేసీఆర్ కీ దక్కుతుందిఅని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మినీ టీచర్లను మెయిన్ టీచర్ గా గుర్తించిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ ఘనత రాష్ట్ర ప్రభుత్వం కే దక్కుతుందని తెలిపారు. అంగనవాడి టీచర్ల రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాల కి అనే ఒక నిమిత్త కాలం పెట్టడంతోపాటు, అంగనవాడి టీచర్ల ఉద్యోగ నియమాకాలలో పారదర్శకత పాటించింది రాష్ట్ర ప్రభుత్వమేనని, గ్రేడ్ టు సూపర్వైజర్ల పోస్టుల నియామకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా 149 మందినీ జేఎన్టీయూ సహకారంతో పారదర్శకంగా నియమించడం జరిగింది అని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో మొదటి సంతకం మహిళా శిశు సంక్షేమ శాఖ ఫైల్ మీద పెట్టిన విషయం ఎవరు మర్చిపోలేదని తెలిపారు. అంగన్వాడి టీచర్లు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్వ ప్రాథమిక విద్యలో ఒకే సిలబస్ ఉండే విధంగా పొందుపరిచిన ఘనత కూడా ఈ ఈ ప్రభుత్వం దేనని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలలో నమోదైన లబ్ధిదారుల పిల్లలు ఆడుకోవడానికి ప్రతి సంవత్సరం ఐదువేల రూపాయలు విలువగల ప్రీస్కూల్ కిట్ అందజేస్తుందని, నిజంగా సమ్మెకు పోయే అంగనవాడిలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఒక్కసారి అక్కడే అమలవుతున్న పథకం తీరును పరిశీలించాలని కోరారు.
గతంలో ధర్నాలు సమ్మెలతో గత ప్రభుత్వంలో సాధించింది ఏమీలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు నిర్వహించి తమ హక్కుల సాధన కోసం కృషి చేయాలి తప్ప చిన్నారులను, గర్భిణీలను, బాలింతలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఏదైనా సామరసపూర్వకంగా శాంతియుత పద్ధతిలో పోరాటం కొనసాగిస్తే మేలు జరుగుతుంది తప్ప ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే మన శాఖకే నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు
Sep 09 2023, 22:01