ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి 4లక్షల టిక్కెట్లు.. సెప్టెంబర్...8 నుండి టికెట్స్ అందుబాటులో
ప్రపంచ కప్ 2023 ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. అక్టోబర్ 5 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టోర్నీ ప్రారంభం కానుంది. భారత్‌లో జరగనున్న ఈ ప్రపంచకప్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొని ఉంది.అందుకే అందరూ టిక్కెట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొంతమంది మాత్రమే విజయం సాధించారు. ఈ క్రమంలో ICC, BCCI విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. అభిమానుల నుంచి నిరంతర ఫిర్యాదుల తరువాత, BCCI మరో రౌండ్ టిక్కెట్ విక్రయాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో అన్ని మ్యాచ్‌ల కోసం మొత్తం 4 లక్షల టిక్కెట్లు సేల్‌లో ఉంచనున్నట్లు తెలిపింది.
సెప్టెంబర్ 8 న విక్రయాలు ప్రారంభం..
ఈ 4 లక్షల టిక్కెట్ల విక్రయం సెప్టెంబర్ 8 రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. వీటిని ప్రపంచ కప్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. మరోసారి టిక్కెట్ల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందని, అందుకే వెంటనే టిక్కెట్లు పొందేందుకు ప్రయత్నించాలని బీసీసీఐ అభిమానులకు సూచించింది. ఇది మాత్రమే కాదు, దీని తర్వాత మరో రౌండ్ విక్రయాలు ఉంటాయని, దాని గురించి త్వరలో అభిమానులకు సమాచారం ఇవ్వనున్నట్లు ఇండియన్ బోర్డ్ తెలిపింది.
Sep 07 2023, 09:14