/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర రెండో షెడ్యూల్డ్ ప్రకటించిన కాంగ్రెస్.. Yadagiri Goud
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర రెండో షెడ్యూల్డ్ ప్రకటించిన కాంగ్రెస్..

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ నాయకత్వంలో కొనసాగే భారత్ జోడో యాత్రం రెండో దశకు సంబంధించిన పూర్తి షెడ్యూల్డ్ ను కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది..

గురువారం (సెప్టెంబర్ 7) ప్రారంభం కానున్న ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి 30 వరకు సాగుతుందని ఆ పార్టీ పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలకు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,081 కిలోమీటర్ల పాటు యాత్రం సాగుతుందని పేర్కొన్నారు..

ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌… రాష్ట్ర వ్యాప్తంగా అమలు?

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ విధానం అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్‌ రెండో వారం నుంచి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లోని దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకు అమలు చేయనున్నారు.

అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీ పాఠశాలల్లో ఫేషియల్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ తీసుకోనున్నారు. ఇక ఇది అందుబాటులోకి వస్తే విద్యార్థుల అటెండెన్స్‌ అంతా ఫేషియల్‌ రికగ్నషన్‌లోకి మారనుంది.

ముందస్తుగా మొదటి దశలో విద్యార్థులకు అమలు చేశాక, తర్వాత టీచర్లకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 10 జిల్లాలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ అమలులో ఉన్నది.

ఫేషియల్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ విద్యార్థులకు విజయవంతంగా అమలు చేశాక, బయోమెట్రిక్‌ స్థానంలో ఉపాధ్యాయులకు సైతం షేషియల్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ను అమలు చేయబోతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి...

పాపికొండల విహారయాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌

గోదావరి పాపికొండల అందాలను వీక్షించేందుకు పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆగస్టులో పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు.

ప్రస్తుతం గోదావరికి వరదలు లేకపోవడంతో నిబంధనలను అనుసరించి పర్యాటక బోట్లు విహరించేందుకు అనుమతించారు బుధవారం ఒక పర్యాటక బోటులో ఉన్నతాధికారులు పేరంటపల్లికి వెళ్లారు.

తిరుమల కాలినడక మార్గంలో భక్తులకు చేతికర్రలను పంపిణీ..

తిరుపతి: తిరుమల కాలినడక మార్గంలో భక్తులకు కర్రలను పంపిణీ చేశారు. నడక మార్గంలో వెళ్లే శ్రీవారి భక్తులకు కర్రల్ని పంపిణీ చేయాలని టీటీడీ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల కోసం పదివేల కర్రలను అందుబాటులోకి తెచ్చారు. మరో పదివేల కర్రలను కూడా సిద్ధం చేయనున్నారు. మొత్తం 20వేల కర్రలను సిద్ధం చేస్తున్నారు. వీటికి కేవలం రూ.45వేలు మాత్రమే ఖర్చు అయినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

కర్రల పంపిణీ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. భూమన మాట్లాడుతూ…. చేతిలో కర్ర ఉంటే జంతువులు రావనేది శాస్త్రీయవాదన అన్నారు. చేతి కర్రల పంపిణీ కేవలం చేతులు దులుపుకునే ప్రక్రియ కాదని స్పష్టం చేశారు. భక్తులకు చేతి కర్రలు ఇచ్చి వాటిని నరసింహ తీర్థం వద్ద తిరిగి తీసుకుంటామన్నారు. చేతి కర్ర మాత్రమే ఇవ్వడం లేదని, మెట్ల మార్గంలో టీటీడీ భద్రతా సిబ్బంది కూడా ఉంటుందన్నారు..

ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై .. గుడ్ న్యూస్ చెప్పిన టి ఎస్ ఆర్ టి సి

ఆర్టీసీ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. బస్సుల్లో ఫ్రీ వైఫై సదుపాయాన్ని కల్పిస్తున్నామంటూ ఆయన ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. కొన్ని బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు.

అనధికారిక సమాచారం ప్రకారం.. తొలి విడతగా హైటెక్ హంగులతో కొత్తగా ప్రవేశపెట్టిన 16 ఏసీ స్లీపర్ బస్సులలో ఫ్రీ వైఫై ను అందుబాటులోకి తెస్తారని తెలుస్తోంది. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి.. తమిళనాడులోని చెన్నై రూట్లలో నడుస్తాయని సమాచారం.

ఇటీవల ఈ బస్సులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ప్రారంభించారు

ఈ బస్సుల్లో ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ సదుపాయాన్ని కల్పించారు. వీటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. 12 మీటర్ల పొడవు ఉండే ఏసీ స్లీపర్ బస్సుల్లో… 15 లోయర్ బెర్త్‌లు, 15 అప్పర్ స్లీపర్ బెర్త్‌లు ఉంటాయి. బెర్త్‌ల వద్ద మొబైల్ చార్జింగ్, రీడింగ్ ల్యాంప్ సౌకర్యాలు ఉంటాయి.

ఈ బస్సుల్లో ఉచిత వై ఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునిక ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం ఏర్పాటు చేశారు...

డ్రగ్స్ కేసులో రాయదుర్గం ఎస్సై రాజేందర్ సస్పెండ్

రాయదుర్గం డ్రగ్స్ కేసులో ఎస్సై రాజేందర్‌‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్సైను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ఎస్సై రాజేంద్రను రాయదుర్గం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి కోర్టు రాజేందర్‌ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతిచ్చింది. దీంతో ఎస్సై రాజేందర్‌ను కస్టడీలోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు.. అతడిని రెండు రోజుల పాటు విచారించనున్నారు. కాగా..

భారీగా డ్రగ్స్ అమ్ముతూ నార్కొటిక్ బ్యూరో టీమ్‌కు రాజేందర్ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన విషయం తెలిసిందే. అతని వద్ద నుంచి నుంచి 1 కిలో 700 గ్రాముల డ్రగ్స్‌ను నార్కోటిక్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. అలాగే రాజేందర్‌కు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు...

సిద్దిపేట నుంచి తిరుపతి కి రైళ్లు ప్రారంభించాలి : మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూర్‌కు రైళ్లు ప్రారంభించడంతో పాటు, సిద్దిపేటకు ప్యాసింజర్ రైలు నడపాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం ను కోరారు.

బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో రైల్వే పెండింగ్ పనుల అంశంపై సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌ను కలిశారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

కొత్తగా నిర్మించిన సిద్దిపేట రైల్వే లైన్ ఈ నెల 15 న రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇన్‌స్పెక్షన్‌ పూర్తి కాగానే ప్యాసింజర్ రైళ్ల ను, హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు పుష్‌పుల్‌ రైల్ ను ప్రారంభించాలన్నారు. పఠాన్ చెరు ఎదులనాగులపల్లిలో గూడ్స్ టెర్మినల్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరారు. కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద కొత్త రైల్వే స్టేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణతోనే సిద్దిపేట ప్రాజెక్ట్ విజయవంతం

మాసాయిపెట్ రైల్వే పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా భూ సేకరణ చేసి రైల్వే శాఖకు ఇవ్వడం వల్లే సిద్దిపేట రైల్వే లైన్ పూర్తయ్యిందని అన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాల నేపధ్యంలో ఔటర్ రింగ్ రైల్వే లైన్ ను మెదక్ ,సిద్దిపేట మీదుగా నిర్మించాలన్నారు .

రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ తోనే సిద్దిపేట ప్రాజెక్ట్ ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.

చేగుంట మెదక్ రోడ్డు లో నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జీఎం ను కోరారు. అన్ని విజ్ఞప్తిలపై సానుకూలంగా స్పందించిన జీఎం అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ మంత్రి, ఎంపీ చేసిన ప్రతిపాదనలను రైల్వే బోర్డ్‌కు పంపిస్తామని పేర్కొన్నారు.....

కేంద్ర కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ బుధవారం భేటీ అయ్యింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌తో సహా స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు హాజరయ్యారు..

జీ20 సదస్సు, పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఆమోదించిన నిర్ణయాలు:

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధికి రూ.3,760 కోట్ల వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌కు ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం.

మొత్తం ఖర్చు తామే భరిస్తామని తెలిపిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.

2030-31 వరకు 5 దశల్లో నిధులు విడుదల చేస్తామన్న అనురాగ్ ఠాకూర్.

దేశంలో 4 వేల మెగావాట్ల నిల్వకు ఈ సిస్టమ్ ఉపకరిస్తుందన్న కేంద్రం.

యబిలిటీ గ్యాప్ ఫండింగ్ వల్ల రూ.9,500 కోట్ల పెట్టుబడులు వస్తాయన్న కేంద్ర మంత్రి.

ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ స్కీమ్ (IDS) 2017 కింద హిమాచల్, ఉత్తరాఖండ్ లో పరిశ్రమల

అభివృద్ధికి అదనపు నిధులు ఇవ్వనున్న కేంద్రం.

రూ.1,164 కోట్లు కేటాయింపు నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.

Agrigold-ED: అగ్రిగోల్డ్ కుంభకోణం.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ

హైదరాబాద్: అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.

అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు విచారణకు స్వీకరించింది.

అక్టోబరు 3న కోర్టుకు హాజరుకావాలని అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీల ప్రతినిధులకు కోర్టు సమన్లు జారీ చేసింది. 32 లక్షల మంది డిపాజిటర్లను రూ.6,380 కోట్ల మేర మోసం చేసినట్లు అగ్రిగోల్డ్‌పై అభియోగాలు దాఖలయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రూ.4,141 కోట్ల మేర ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది..

TTD: తిరుమల శ్రీవారికి రూ.2కోట్ల విలువైన బంగారు పుష్పాలు

తిరుమల: కడప జిల్లాకు చెందిన భక్తుడు రాజారెడ్డి తిరుమల శ్రీవారికి 108 బంగారు పుష్పాలను బహూకరించారు.

ఈ బంగారు పుష్పాలను లలితా జ్యూవెలరీ కంపెనీ తయారు చేసినట్టు ఆ కంపెనీ అధినేత కిరణ్‌ కుమార్‌ తెలిపారు..

దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో ఈ పుష్పాలను తయారు చేసినట్టు వెల్లడించారు. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న రాజారెడ్డి, కిరణ్‌ కుమార్‌ స్వామివారికి బంగారు పుష్పాలను సమర్పించారు. ఈ బంగారు పుష్పాలను శ్రీవారి అష్టదళపాదపద్మారాధన సేవకు వినియోగించనున్నారు..