తిరుమల కాలినడక మార్గంలో భక్తులకు చేతికర్రలను పంపిణీ..
తిరుపతి: తిరుమల కాలినడక మార్గంలో భక్తులకు కర్రలను పంపిణీ చేశారు. నడక మార్గంలో వెళ్లే శ్రీవారి భక్తులకు కర్రల్ని పంపిణీ చేయాలని టీటీడీ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల కోసం పదివేల కర్రలను అందుబాటులోకి తెచ్చారు. మరో పదివేల కర్రలను కూడా సిద్ధం చేయనున్నారు. మొత్తం 20వేల కర్రలను సిద్ధం చేస్తున్నారు. వీటికి కేవలం రూ.45వేలు మాత్రమే ఖర్చు అయినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
కర్రల పంపిణీ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. భూమన మాట్లాడుతూ…. చేతిలో కర్ర ఉంటే జంతువులు రావనేది శాస్త్రీయవాదన అన్నారు. చేతి కర్రల పంపిణీ కేవలం చేతులు దులుపుకునే ప్రక్రియ కాదని స్పష్టం చేశారు. భక్తులకు చేతి కర్రలు ఇచ్చి వాటిని నరసింహ తీర్థం వద్ద తిరిగి తీసుకుంటామన్నారు. చేతి కర్ర మాత్రమే ఇవ్వడం లేదని, మెట్ల మార్గంలో టీటీడీ భద్రతా సిబ్బంది కూడా ఉంటుందన్నారు..
Sep 06 2023, 21:43