/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Agrigold-ED: అగ్రిగోల్డ్ కుంభకోణం.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ Yadagiri Goud
Agrigold-ED: అగ్రిగోల్డ్ కుంభకోణం.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ

హైదరాబాద్: అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.

అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు విచారణకు స్వీకరించింది.

అక్టోబరు 3న కోర్టుకు హాజరుకావాలని అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీల ప్రతినిధులకు కోర్టు సమన్లు జారీ చేసింది. 32 లక్షల మంది డిపాజిటర్లను రూ.6,380 కోట్ల మేర మోసం చేసినట్లు అగ్రిగోల్డ్‌పై అభియోగాలు దాఖలయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రూ.4,141 కోట్ల మేర ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది..

TTD: తిరుమల శ్రీవారికి రూ.2కోట్ల విలువైన బంగారు పుష్పాలు

తిరుమల: కడప జిల్లాకు చెందిన భక్తుడు రాజారెడ్డి తిరుమల శ్రీవారికి 108 బంగారు పుష్పాలను బహూకరించారు.

ఈ బంగారు పుష్పాలను లలితా జ్యూవెలరీ కంపెనీ తయారు చేసినట్టు ఆ కంపెనీ అధినేత కిరణ్‌ కుమార్‌ తెలిపారు..

దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో ఈ పుష్పాలను తయారు చేసినట్టు వెల్లడించారు. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న రాజారెడ్డి, కిరణ్‌ కుమార్‌ స్వామివారికి బంగారు పుష్పాలను సమర్పించారు. ఈ బంగారు పుష్పాలను శ్రీవారి అష్టదళపాదపద్మారాధన సేవకు వినియోగించనున్నారు..

Chandrababu: రేపో, ఎల్లుండో నన్ను అరెస్టు చేయొచ్చు: చంద్రబాబు

రాయదుర్గం: జగన్‌ పాలనలో అన్నీ అరాచకాలే అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు..

పలువురు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకురాగా.. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆస్తుల దోపిడీ జరిగిందని ఆరోపించారు.

''వైకాపా విధ్వంస పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారు. జగన్‌.. సైకో సీఎం మాత్రమే కాదు... కరడుగట్టిన సైకో. రైతులకు కూడా చెప్పకుండా భూముల్లో కాల్వలు తవ్వుతున్నారు. తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి ఉంది. ఇసుక అక్రమాలపై NGTలో కేసులు వేసిన నాగేంద్రను వేధిస్తున్నారు. రేపో, ఎల్లుండో నన్ను అరెస్టు చేయొచ్చు. లేకుంటే దాడి చేస్తారు. నిప్పులా బతికాను.. నేను ఏ తప్పూ చేయలేదు'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు..

స‌చివాల‌యంలో యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ ప్రారంభం

డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ తెలంగాణ స‌చివాల‌య స‌ముదాయ ప్రాంగ‌ణంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి బుధ‌వారం ప్రారంభించారు.

సచివాలయం ఉద్యోగులకు బ్యాంక్ ఉత్తమ సేవలు అందించేందుకు బ్యాంక్ అధికారులు కృషి చేయాలని సీఎస్‌ కోరారు. బ్యాంక్ అధికారులతో కలసి సీఎస్ స్ట్రాంగ్ రూమ్, కంప్యూటర్ సెంటర్‌ను పరిశీలించారు.

ప్రస్తుతం బీఆర్‌కే భ‌వ‌న్‌లో సేవలు అందిస్తున్న బ్యాంకు బ్రాంచ్ బుధ‌వారం నుంచి నూతన కార్యాలయం ద్వారా సేవలు కొనసాగిస్తుందని బ్యాంక్ చీఫ్ మేనేజర్ విజయ్ కుమార్ తెలిపారు.

బ్యాంక్ అధికారులు, సిబ్బందికి సీఎస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ కారే భాస్కర్ రావు, రీజినల్ హెడ్ కె శ్రీధర్ బాబు, బ్రాంచ్ చీఫ్ మేనేజర్ వీ విజయ్ కుమార్, మేనేజర్ అనూష, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు..

వైఎస్ షర్మిల ఎమ్మెల్సీ కవితకు లేఖ

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల లేఖ రాశారు.

మహాత్మా గాంధీ చెప్పినట్లు మీరు చూడాలి అనుకుంటున్న మార్పు, మీ నుంచే మొదలు పెట్టండి. మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి 5శాతం కూడా మహిళలకు సీట్లు ఇవ్వలేదు.

నా అభిప్రాయంతో పాటు, ఇటీవల బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా కూడా పంపుతున్న. జాబితాతో పాటు ఒక కాలిక్యులేటర్‌ లింక్ కూడా పంపిస్తున్నా.

బీఆర్‌ఎస్ జాబితా చూసి 33 శాతం ఇచ్చారా? లేదా? లెక్కించండి. మద్దతు కూడగట్టే ముందు మీ తండ్రితో ఈ విషయం చర్చ చేయాలని మనవి’’ అంటూ షర్మిల లేఖలో పేర్కొన్నారు......

రేపు విధుల బహిష్కరణకు హోంగార్డుల పిలుపు

విధుల బహిష్కరణకు హోంగార్డుల జేఏసీ పిలుపునిచ్చింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపటి గురువారం నుంచి విధులు బహిష్కరించాలని హోంగార్డ్ జాక్ పిలుపునిచ్చింది. మరోవైపు హోంగార్డ్ రవీందర్‌కు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ క్రమంలో హోంగార్డులంతా ఉస్మానియా ఆస్పత్రికి రావాలని జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో పెద్దఎత్తున్న హోంగార్డులు ఉస్మానియా ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హోంగార్డు జేఏసీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ..

హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నంపై వెంటనే ప్రభుత్వo స్పందించాలని డిమాండ్ చేశారు. రవీందర్ బ్రతకడం చాలా కష్టమన్నారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల విధులు బహిష్కరణకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

హోంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలని.. సకాలంలో హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నానరు.

తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు విధులు బహిష్కరిస్తామన్నారు. రేపటి నుంచి హోంగార్డులు ఎవ్వరు విధుల్లో ఉండకూడదని నారాయణ తెలిపారు..

ప్రధాని మోడీకి సోనియా గాంధీ సంచలన లేఖ

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాను చెప్పకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ డిమాండ్లు చేస్తూ సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సోనియా గాంధీ ప్రధానికి లేఖ రాశారు. తన లేఖలో, ప్రత్యేక సెషన్ ఎజెండాను చెప్పనందుకు సోనియా అభ్యంతరం వ్యక్తం చేశారు, అదే సమయంలో ఆమె తన తరపున తొమ్మిది డిమాండ్లను కూడా ఉంచారు. అదానీ కేసులో జెపిసి విచారణ సహా కుల గణన అంశాన్ని సోనియా గాంధీ లేవనెత్తారు.

సెప్టెంబర్ 18 నుండి సెప్టెంబర్ 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని పిలిచినట్లు మీకు తెలియజేద్దాం. అయితే, ఈ సెషన్ ఎజెండాకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఎజెండాను ప్రభుత్వం వెల్లడించాలని ప్రతిపక్షాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై సోనియా గాంధీ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు.మొదటి సారిగా పార్లమెంట్ సమావేశాల ఎజెండాను ప్రతిపక్షాలతో పంచుకోవడం లేదని.. సాధారణంగా ప్రత్యేక సమావేశానికి ముందు చర్చలు జరిపి ఏకాభిప్రాయం కుదుర్చుకుంటారని ఆమె ఈ లేఖలో రాశారు. చేరుకుంది. దీని ఎజెండాను కూడా ముందుగానే ఫిక్స్ చేసి ఏకాభిప్రాయానికి ప్రయత్నించడం.. మీటింగ్ పెట్టడం, ఎజెండా ఫిక్స్ కాకపోవడం ఇదే తొలిసారి.

ఏ అంశంపైనా చర్చకు డిమాండ్ లేదు

అదే సమయంలో సోనియా గాంధీ ఈ లేఖలో మొత్తం 9 అంశాలను ముందుకు తెచ్చారు. వీటిలో ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర అంశాలపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. రైతులకు సంబంధించి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, ఎంఎస్పీ హామీపై ఇప్పటి వరకు ఏం జరిగింది. అదానీ కేసుపై సోనియాగాంధీ జెపిసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు, అంతే కాకుండా కుల గణనను వెంటనే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు దేశంలో మత ఉద్రిక్తతలు, మణిపూర్ హింస, లడఖ్‌లో చైనా చొరబాటు వంటి అంశాలు తెరపైకి వచ్చాయి.

జైరాం రమేష్ ఏమన్నారు?

సోనియా గాంధీ లేఖపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ, ఈ ప్రత్యేక సమావేశం గురించి ఎవరికీ తెలియదని అన్నారు. ప్రత్యేక సెషన్‌కు సంబంధించిన ఎజెండా గురించి మా వద్ద ఎలాంటి సమాచారం లేనప్పుడు ఇది మొదటిసారిగా జరుగుతోంది. మీడియాతో జైరాం రమేష్ మాట్లాడుతూ, నిన్న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నివాసంలో అఖిలపక్షం నేతల సమావేశం జరిగింది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను బహిష్కరించేది లేదని తేల్చిచెప్పాం. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డానికి ఇదొక స‌ద‌వ‌కాశం, ప్ర‌తి పార్టీ వివిధ స‌మ‌స్య‌ల‌ను ముందుకు తెచ్చేందుకు త‌న వంతు కృషి చేస్తుంది.

సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభలు నోటిఫికేషన్ జారీ చేశాయని మీకు తెలియజేద్దాం. ఈ ఐదు రోజుల సెషన్ సెప్టెంబర్ 22 వరకు కొనసాగుతుంది. లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌లు ఈ మేరకు సమాచారం అందించాయి. 17వ లోక్‌సభ 13వ సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమవుతాయని, ప్రభుత్వ పనితీరును బట్టి సెప్టెంబర్ 22 వరకు కొనసాగుతాయని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది. రాజ్యసభ సెక్రటేరియట్ తన బులెటిన్‌లో, “రాజ్యసభ యొక్క 261వ సమావేశాలు సెప్టెంబర్ 18 నుండి ప్రారంభమవుతాయని సభ్యులకు తెలియజేయబడింది.” సెషన్ సెప్టెంబర్ 18,19, 20, 21 మరియు 22 తేదీలలో కొనసాగుతుంది. సెషన్ సాధారణంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, ఆపై మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకు నడుస్తుందని పేర్కొంది.

ఒకే దేశం- ఒకే ఎన్నికలు.. నేడు రామ్‌నాథ్ నివాసంలో అధ్యయన కమిటీ తొలి అధికారిక భేటీ..

దేశంలో జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ''ఒకే దేశం- ఒకే ఎన్నికలు'' సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే..

ఇందులో 8 మంది సభ్యులను నియమించింది. అయితే ఈ కమిటీ తొలి భేటీ మొదటి అధికారిక సమావేశం ఈరోజు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుందని సమాచారం. సార్వత్రిక ఎన్నికలు ముందే జరుగుతాయనే ఊహాగానాలు మధ్య కేంద్రం చర్యలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి..

NASA: విక్రమ్‌ ల్యాండర్‌ను క్లిక్‌మనిపించిన నాసా ఉపగ్రహం..

వాషింగ్టన్‌: భారత్‌లో చంద్రయాన్‌-3(Chandrayaan-3) ప్రయోగానికి సంబంధించి ఇస్రో(ISRO) ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ ప్రజల్లో ఆసక్తిని పెంచుతూనే ఉంది..

అయితే తాజాగా అమెరికాకు చెందిన నేషనల్‌ ఏరోనాటిక్స్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(నాసా)(NASA) చంద్రయాన్‌-3 ల్యాండర్‌ చిత్రాన్ని ఎక్స్‌(ట్విటర్‌)లో పంచుకుంది. తన ఉపగ్రహం ఈ ఫొటోను తీసినట్లు తెలిపింది.

'జాబిల్లి ఉపరితలంపై ఉన్న చంద్రయాన్‌-3 ల్యాండర్‌ను నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఓ(లునార్‌ రికానజెన్స్‌ ఆర్బిటర్‌) స్పేస్‌క్రాఫ్ట్‌ ఫొటో తీసింది. ఆగస్టు 23న ఈ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువానికి సుమారు 600 కి.మీ దూరంలో దిగింది' అని నాసా వెల్లడించింది. ల్యాండర్ దిగిన నాలుగురోజుల తర్వాత ఆగస్టు 27న ఎల్‌ఆర్‌ఓ ఈ చిత్రాన్ని తీసింది. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ దిగుతున్నప్పుడు కలిగిన రాపిడి వల్ల ఒక తెల్లని వలయం ఏర్పడిందని ఈ చిత్రాలను బట్టి తెలుస్తోంది..

చంద్రుడి ఉపరితలం 3డీ అనాగ్లిఫ్‌ చిత్రాన్ని నిన్న ఇస్రో విడుదల చేసింది. అందులో విక్రమ్‌ ల్యాండర్‌ ఉన్న ప్రాంతంలో చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజ్ఞాన్‌ రోవర్‌కు అమర్చిన నేవిగేషన్‌ కెమెరాలతో తీసిన చిత్రాలను ప్రత్యేక పద్దతిలో క్రోడీకరించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఇస్రో ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా విడుదల చేసింది. స్టీరియో లేదా మల్టీ వ్యూ ఇమేజ్‌లను ఒకచోట చేర్చి అవి మూడు కోణాల్లో కనిపించేలా చేయడమే అనాగ్లిఫ్‌. ప్రస్తుతం నిద్రాణంలో ఉన్న ల్యాండర్, రోవర్ సెప్టెంబర్ 22న తిరిగి మేల్కొనే అవకాశం ఉందని ఇస్రో భావిస్తోంది. ఊహించినట్లు అవి పని చేస్తే.. ఇంకొన్నాళ్లపాటు పరిశోధనలు సాగించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది..

Congress Party : తాజ్ కృష్ణాలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : తాజ్ కృష్ణాలో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది..

దీనికి స్క్రీనింగ్ కమిటీ సభ్యులంతా హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుది దశకి చేరుకోనుంది. నేడు తుది నివేదిక రూపొందించడం జరగనుంది.

సాయంత్రం సీల్డ్ కవర్లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీకి స్క్రీనింగ్ కమిటీ నివేదికను అందించనుంది. ఇప్పటికే దాదాపు 30 మంది సభ్యులు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాలకు స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల విషయమై కసరత్తు చేస్తోంది. త్వరలోనే అన్ని నియో జకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ వెలువరించనుంది..