నారా లోకేష్‌కు భీమవరం పోలీసుల నోటీసులు
![]()
పశ్చిమగోదావరి: భీమవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌కు భీమవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. యువగళం పాదయాత్రలో టీడీపీ రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే..
పుంగనూరులో చంద్రబాబు కనుసన్నల్లో దౌర్జన్యాలకు తెగబడగా... భీమవరంలో లోకేశ్ ప్రోద్బలంతో పేట్రేగి పోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్‌లో మంగళవారం రాత్రి బహిరంగ సభ అనంతరం గునుపూడి శివారులో టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు బరి తెగించాయి.
లోకేశ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ వద్ద టీడీపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గతంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై వాటర్ బాటిళ్లు, రాళ్లు రువ్వడంతో పాటు ఫ్లెక్సీని తొలగించడానికి ప్రయత్నించారు. వివేకానందరెడ్డిని చంపింది ఎవరంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను పట్టుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు..




Sep 06 2023, 12:44
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.8k