గుంతకల్ రాయదుర్గం పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు నేడు పర్యటన
నేటి నుంచి మూడు రోజులు పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. బాబు ష్యురిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
నేడు ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు బళ్లారి జిల్లా జిందాల్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. బళ్లారిలో స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన రాయదుర్గం నియోజకవర్గం ఓబులాపురం చెక్‌పోస్ట్‌కు చేరుకుంటారు.
రాయదుర్గం నియోజకవర్గం పల్లె పల్లె సమీపంలో వేరుశనగ రైతులతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు రాయదుర్గం పట్టణానికి చేరుకుని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
రేపు 6న కళ్యాణదుర్గం, 7న గుంతకల్లు నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. చంద్రబాబు రాక సందర్భంగా ఘనంగా టీడీపీ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు చేశారు...


 
						




 

 
 





 
 
Sep 05 2023, 09:43
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.2k