/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png
NLG: లెంకలపల్లి లో భారీ వర్షానికి మునిగిపోయిన వరిచేను
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి పంటచేలు మునిగిపోవడం జరిగింది. సంబంధిత అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.
NLG: బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన చైతన్య సైకిల్ యాత్ర వాల్ పోస్టర్ రిలీజ్
నల్లగొండ జిల్లా, పెద్దవూర మండల కేంద్రంలో బిఎస్పి ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహాల వద్ద, శనివారం బహుజన చైతన్య సైకిల్ యాత్ర వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.
కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమల్ల వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ.. అక్టోబర్ 1 ఆదివారం నాడు హాలియా పట్టణ కేంద్రంలో జరగబోయే 'బహుజన సింహగర్జన' సభను విజయవంతం చేయడం కోసం పెద్దవూర మండలంలో సోమవారం నుండి అన్ని గ్రామాలలో "బహుజన చైతన్య సైకిల్ యాత్ర' ద్వారా అన్ని గ్రామాలలో అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేసి వచ్చే సాధారణ ఎన్నికలలో బహుజనుల సత్తా చూపిస్తామని అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు బత్తుల ప్రసాద్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటేశ్వర్లు, పెద్దవూర మండల అధ్యక్షుడు కుక్కముడి ముత్యాలు, పెద్దవూర మండల ప్రధానకార్యదర్శి ఆదిమల్ల సత్యనారాయణ, మంద ఏలియా, సంగారం గ్రామ శాఖ అధ్యక్షుడు తరి రవికుమార్, తరి శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
YBD: ఎల్ఓసి అందజేసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా (YBD), నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన వీరమల్ల జంగయ్య S/0 గోపాల్ కు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి పథకం నుండ ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ2,50,000/- ఎల్ఓసి ని వీరమల్ల జంగయ్య కు అందజేశారు. కార్యక్రమంలో నారాయణపురం మండల జెడ్పీటీసీ సభ్యులు వీరమల్ల భానుమతి వెంకటేశం గౌడ్, చండుర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మన్నే ఇంద్రసేనారెడ్డి, బిఆర్ఎస్వి మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు నలపరాజు రమేష్ , బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వీరమల్ల జంగయ్య, బాలగొని శ్రీను తదితులున్నారు.
NLG: 'సంక్షేమ పథకాల రారాజు వైఎస్ఆర్'
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా, నేదుబ్నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో వైయస్సార్ అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, వైయస్సార్ ని స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దివంగత నేత వైయస్సార్ ప్రజల గుండెల్లో చిరంజీవి గా ఉన్నారని, సంక్షేమ పథకాల రారాజు వైయస్సార్ అని ఆయన సేవలను కొనియాడారు
కార్యక్రమంలో మేతరి శంకర్, పగిళ్ల రాజశేఖర్ అబ్బనగోని శీను, దాసరి వెంకన్న, పగిళ్ల అశోక్, పెంబల్ల గిరి యాదవ్, గుండెపురి శంకర్, తదితరులు పాల్గొన్నారు.
NLG: పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
నల్లగొండ: పట్టణ కేంద్రంలోని చర్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం వారు.. సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ గంజాయి డ్రగ్స్ నిషేధం మరియు బ్యాంకింగ్ ఆన్లైన్ మోసాల గురించి వివరించి అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పోలీస్ కళాబృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
NLG: ఉద్యోగుల పెన్షన్ విద్రోహ దినం, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ఉద్యోగులు
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది శుక్రవారం నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలియజేశారు. వారు మాట్లాడుతూ.. కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం 2004 సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అమలులోకి వచ్చిందని, ఈ రోజున ఉద్యోగులు పెన్షన్ విద్రోహ దినంగా పాటించడం జరుగుతుందని తెలిపారు. నాగార్జున కళాశాలలోని అధ్యాపక మరియు అధ్యాప కేతర సిబ్బంది సిపిఎస్ విధానాన్ని నిరసిస్తూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు
నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగులు తమ జీవిత కాలం చేసిన సేవలకు పెన్షన్ లేకపోవడం అత్యంత బాధాకరం. ఉద్యోగుల జీతం నుంచి కట్ చేసిన కాంట్రిబ్యూషన్ నిధిని స్టాక్ మార్కెట్లో పెట్టడం వలన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నూతన పెన్షన్ విధానం రద్దుచేసి, పాత పెన్షన్ విధానం అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
NLG: ఐద్వా సభ్యత్వం చేస్తున్న భూతం అరుణ కుమారి ఐద్వా పట్టణ కార్యదర్శి
నల్లగొండ: ఐద్వా ఆధ్వర్యంలో పట్టణంలోని అబ్బాసియా కాలనీలో శుక్రవారం ఐద్వా సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి మాట్లాడుతూ.. నిత్యం మహిళలపై హత్యలు, అత్యాచారాలు దాడుల పెరుగుతున్నాయి. రోజు మహిళలకు ఎక్కడో అక్కడ అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళలకు అండగా ఉంటూ, ఈ సభ్యత్వం పేరుతో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. గతంలో రేషన్ షాపులో 14 రకాల సరుకులు ఇవ్వాలని, వార్డు వార్డు సర్వే చేయడం జరిగింది. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఐద్వా ముందుంటుందని అన్నారు. ఈ సంస్థ స్థాపించి 42 సంవత్సరాలు అయినప్పటికీ ఐద్వా మహిళల వెన్నంటే ఉంటూ ప్రజల సమస్యలు అలాగే మహిళల సమస్యలపై పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కమిటీ సభ్యులు నిష్రత్, ఉన్నీసా, జానకమ్మ, నర్సమ్మ, సుజాత, సుగుణమ్మ, లక్ష్మమ్మ, లికిత తదితరులు పాల్గొన్నారు.
'చలో హైదరాబాద్ సెప్టెంబర్ 5న లేబర్ ఆఫీస్ ముట్టడిని జయప్రదం చేయాలి'
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: గతంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో భవన నిర్మాణ కార్మికులకు ప్రకటించిన మోటార్ సైకిల్ ను, కార్మికులకు అందించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు సెప్టెంబర్ ఐదున చలో లేబర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేయడం జరిగింది. లేబర్ కార్డు ఉన్న కార్మికుడికి సొంత ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు, అంగవైకల్యం చెందిన కార్మికులకు నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన మోటార్ సైకిల్ స్కూటీలను వెంటనే ఇవ్వాలి. ఎల్ఓ కార్యాలలో పెండింగ్ క్లైములు వెంటనే పరిష్కరించి నిధులు విడుదల చేయాలని, పైరవీకారుల వ్యవస్థను అరికట్టాలి అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అట్లాగే నిర్మాణరంగంలో వాడే ముడి సరుకుల ధరలు మరియు కార్మికులు నిత్యం వాడే నిత్యవసర వస్తువులను తగ్గించాలని, రాష్ట్ర వెల్పర్ బోర్డు అడ్వైజర్ కమిటీని ట్రేడ్ యూనియన్ నాయకులతో నియమించాలి.
కార్డుకు అప్లై చేసుకునే ముందు వేలిముద్ర పద్ధతిని మార్పు చేసి ఐరిష్ పద్ధతిని పెట్టాలి. రాష్ట్రంలో 25 లక్షల కార్మికులు ఉంటే తొమ్మిది సంవత్సరాలు గడిచిన 15 లక్షలమందికి మాత్రమే చట్టబద్ధత కల్పించారు. మిగతా పది లక్షల కార్మికులకు ఎలాంటి భద్రత లేకుండా అన్యాయం చేశారు. అందుకు భవన నిర్మాణ కార్మికులంతా సెప్టెంబర్ 5న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు గ్యార యాదయ్య, బుసరాజు లక్ష్మణ్, పగడాల అంజయ్య, నూకల యాదయ్య, కుందేలు అభిలాష్, కురంపల్లి యాదమ్మ తదితరులు పాల్గొన్నారు
"నాగం భేరి" మాస పత్రికను విడుదల చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్
నల్లగొండ: బిజెపి నాయకులు డా. నాగం వర్షిత్ రెడ్డి.. భారతీయ జనతా పార్టీని ప్రజల వద్దకు చేరే విధంగా, నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య శిబిరాలు, వివిధ సేవా కార్యక్రమాలు, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, పల్లెల్లో చేసిన విస్తృత పర్యటన వివరాలను పొందుపరిచి ప్రచురించిన "నాగం బేరి" మాసపత్రికను జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ చేతుల మీదుగా గురువారం, బిజెపి జిల్లా కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, జిల్లా ఇంఛార్జి ప్రదీప్ , జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, ముత్యాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Sep 03 2023, 18:23