Nadendla: 'ఒకే దేశం- ఒకే ఎన్నిక'కు జనసేన మద్దతు: నాదెండ్ల మనోహర్
![]()
మంగళగిరి: ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానానికి తమ పార్టీ మద్దతిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడతూ..
ఈ అంశంపై భాజపా పెద్దలు పవన్ కల్యాణ్‌తో ఇప్పటికే చర్చించారన్నారు. దీనిపై మరింత లోతైన చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ విధానంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పిన మనోహర్.. ఎన్నికల సమయంలో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఈనెల 2న పవన్ పుట్టిన రోజును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం, భవన నిర్మాణ కార్మికులతో కలసి సహపంక్తి భోజనం, రెల్లి కాలనీ వాసుల మధ్య పుట్టిన రోజు వేడుకలు, ఎస్సీ బాలుర వసతి గృహాలలో పెన్నులు, నోట్ బుక్స్ పంపిణీ, ప్రభుత్వ సహాయం అందని విభిన్న ప్రతిభా వంతులను దత్తత తీసుకొని వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతున్నామన్నారు..



Sep 01 2023, 22:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.7k