'చలో హైదరాబాద్ సెప్టెంబర్ 5న లేబర్ ఆఫీస్ ముట్టడిని జయప్రదం చేయాలి'
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: గతంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో భవన నిర్మాణ కార్మికులకు ప్రకటించిన మోటార్ సైకిల్ ను, కార్మికులకు అందించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు సెప్టెంబర్ ఐదున చలో లేబర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేయడం జరిగింది. లేబర్ కార్డు ఉన్న కార్మికుడికి సొంత ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు, అంగవైకల్యం చెందిన కార్మికులకు నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన మోటార్ సైకిల్ స్కూటీలను వెంటనే ఇవ్వాలి. ఎల్ఓ కార్యాలలో పెండింగ్ క్లైములు వెంటనే పరిష్కరించి నిధులు విడుదల చేయాలని, పైరవీకారుల వ్యవస్థను అరికట్టాలి అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అట్లాగే నిర్మాణరంగంలో వాడే ముడి సరుకుల ధరలు మరియు కార్మికులు నిత్యం వాడే నిత్యవసర వస్తువులను తగ్గించాలని, రాష్ట్ర వెల్పర్ బోర్డు అడ్వైజర్ కమిటీని ట్రేడ్ యూనియన్ నాయకులతో నియమించాలి.
కార్డుకు అప్లై చేసుకునే ముందు వేలిముద్ర పద్ధతిని మార్పు చేసి ఐరిష్ పద్ధతిని పెట్టాలి. రాష్ట్రంలో 25 లక్షల కార్మికులు ఉంటే తొమ్మిది సంవత్సరాలు గడిచిన 15 లక్షలమందికి మాత్రమే చట్టబద్ధత కల్పించారు. మిగతా పది లక్షల కార్మికులకు ఎలాంటి భద్రత లేకుండా అన్యాయం చేశారు. అందుకు భవన నిర్మాణ కార్మికులంతా సెప్టెంబర్ 5న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు గ్యార యాదయ్య, బుసరాజు లక్ష్మణ్, పగడాల అంజయ్య, నూకల యాదయ్య, కుందేలు అభిలాష్, కురంపల్లి యాదమ్మ తదితరులు పాల్గొన్నారు
Sep 01 2023, 21:16