కాంగ్రెస్‌గూటికి తుమ్మల నాగేశ్వరరావు?
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది.
అతి త్వరలోనే తేదిని ప్రకటించనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏఐసీసీ ఆదేశాల మేరకు గురువారం తుమ్మలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవిలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.
తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించారు. గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న తుమ్మలపై కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఫోకస్ పెట్టింది.
పార్టీలోకి తీసుకువచ్చేందుకు స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సీనియర్ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగిన ఉన్న వ్యక్తితో పార్టీకి మేలు జరుగుతుందని భావించారు.దీంతోనే తుమ్మలను కాంగ్రెస్‌లోకి చేరాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక తుమ్మల కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న విషయం తెలుసుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా అనుచరులు, కార్యకర్తలు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ప్రాధాన్యత లేని పార్టీలో ఉండటం కంటే.. కాంగ్రెస్‌లో చేరి బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలని ఆ జిల్లా కార్యకర్తలు నొక్కి చెబుతున్నారు.
ఇక తుమ్మల, రేవంత్‌లు గతంలో టీడీపీలో కలసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో సీనియర్ నేతగా ఉన్న తుమ్మలకు రేవంత్ మంచి ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉన్నదని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కేడర్ చర్చించుకుంటున్నది.
సీనియర్ నేతగా గుర్తింపు...
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరావు రాజకీయాల్లో సుపరిచితుడు. తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1982లో ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలోకి చేరిన ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు.
మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సొంత గడ్డ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి తుమ్మల మొదటి సారి ఓటమి పాలైనా.. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టారు.
Sep 01 2023, 09:43