Chandrayaan-3: చంద్రుడి ఉపరితలంపై సహజ ప్రకంపనలు..?
![]()
బెంగళూరు: జాబిల్లిపై శాస్త్రీయ పరిశోధనలు సాగిస్తోన్న చంద్రయాన్-3 (Chandrayaan-3) పేలోడ్‌లు.. ఆసక్తికర సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు, సల్ఫర్ వంటి మూలకాల లభ్యత తదితర సమాచారాన్ని ఇప్పటికే చేరవేశాయి..
ఈ క్రమంలోనే విక్రమ్ ల్యాండర్ (Vikram Lander)లోని ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిస్మిక్ యాక్టివిటీ (ILSA) పేలోడ్.. తాజాగా చంద్రుడిపై సహజ ప్రకంపనలను నమోదు చేయడం గమనార్హం. ఈ మేరకు ఇస్రో (ISRO) ఓ ట్వీట్ చేసింది..
'చంద్రయాన్-3 ల్యాండర్‌లోని 'ఇల్సా' పేలోడ్.. చంద్రుడి ఉపరితలంపై రోవర్, ఇతర పేలోడ్‌ల కారణంగా ఏర్పడిన ప్రకంపనలు నమోదు చేసింది. వీటికి అదనంగా.. అక్కడ సహజంగా ఏర్పడినట్లు భావిస్తోన్న ప్రకంపనలనూ గుర్తించింది. ఆగస్టు 26న వాటిని నమోదు చేసింది. వాటి మూలాన్ని గుర్తించే దిశగా అన్వేషణ సాగుతోంది. ఇదిలా ఉండగా.. 'ఇల్సా' పేలోడ్.. చంద్రుడిపై మొట్టమొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ (MEMS) సాంకేతిక ఆధారిత పరికరం' అని ఇస్రో తెలిపింది. 'ఇల్సా' పేలోడ్‌ను 'లేబొరేటరీ ఫర్ ఎలక్ట్రో- ఆప్టిక్స్ సిస్టమ్స్' రూపొందించిందని వెల్లడించింది. దాన్ని చంద్రుడి ఉపరితలంపై మోహరించే యంత్రాంగాన్ని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసిందని తెలిపింది..



Sep 01 2023, 09:13
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.2k