NLG: కలెక్టర్ కు రాఖీ కట్టిన సెకండ్ ఏఎన్ఎం లు
నల్లగొండ: గత 15 రోజులుగా 2వ ఏఎన్ఎం లు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావు కోరారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో రెండవ ఏఎన్ఎంల నిరవధిక సమ్మె కలక్టర్ కార్యాలయం ముందు జరుగుతున్న సందర్భంగా బుధవారం ఉజ్జీని యాదగిరి రావు దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. తెలంగాణా వస్తె కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని చెప్పిన ప్రభుత్వం 16 సంవత్సరాలుగా పని చేస్తున్న వారినీ పర్మినెంట్ చేయకపోవడం అన్యాయమని అన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎం లను అందరిని బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
ఏఎన్ఎం లు ముందుగా జిల్లా కలెక్టర్ కర్ణన్ కు రాఖీ కట్టి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, డివిజన్ కార్యదర్శి వి.లెనిన్, 2వ ఏ ఎన్ ఎం ల యూనియన్ జిల్లా అద్యక్షులు పోలే రత్నకుమారి, జిల్లా కార్యదర్శి నర్సమ్మ, పద్మ, హారతి, గీత, సరిత, అన్నపూర్ణ, శోభ, అండాలు, సౌజన్య, పద్మ, సలోని, సుచిత్ర , మాధురి, భవానీ, విద్య, నాగశ్రీ, సంతోష, భాగ్య, శైలజ, కవిత, అండాలు, సరళ, సువర్ణ, సత్యమ్మ, పార్వతి, సుమతి, పద్మావతి, శోభ, రుక్సానా, సుప్రియ సాలమ్మ, నీలవేణి, శారద, విజయలక్ష్మి, జ్యోతి, లలిత, శ్రీలత, నూర్జహాన్, ధనలక్ష్మి, అరుణ, ప్రేమలత, సుమలత, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Aug 31 2023, 14:40