అక్రమ అరెస్టులతో బహుజన రాజ్యాన్ని ఆపలేరు: బీఎస్పీ నకిరికల్ నియోజకవర్గ ఇన్చార్జ్
ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చలో సూర్యాపేట పిలుపు మేరకు, నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మరియు నకిరేకల్ నియోజకవర్గ నాయకులు సూర్యాపేట కు తరలి వెళ్లగా మార్గ మధ్యలో పోలీస్ లు అరెస్టు చేసి అర్వపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. బీసీ బిడ్డ అయిన వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు బనాయిస్తూ వేధించడం చాలా సిగ్గుచేటని, బీసీలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా వారిని అణచివేయడంలో భాగంగానే ఈ అరెస్టులకు తెర లేపినారని ఆమె భావిస్తున్నట్లు తెలిపారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, లేనిపక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజనులు అంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. అక్రమ అరెస్టులతో బహుజన రాజ్యాన్ని ఆపలేరని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గం ఉపాధ్యక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, రామన్నపేట మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, చిట్యాల మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య, చిట్యాల అడ్వైజర్ జిట్ట నర్సింహా రాజ్, అన్నమళ్ళ సైదులు తదితరులు ఉన్నారు.
Aug 31 2023, 12:45