_పారిశ్రామిక కార్మికులు గా ఉన్నా ఆర్టీసి కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండేలా చూడాలి
_పారిశ్రామిక కార్మికులు గా ఉన్నా ఆర్టీసి కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండేలా చూడాలి
పారిశ్రామిక కార్మికులుగా ఉన్న ఆర్టీసి కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ వుండేలా చూడటం, అమలులో వున్న అలవెన్సులను పూర్తిగా కొనసాగించాలని తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు నల్గొండ డిపో గౌరవాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య . ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
బుధవారం ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన ఆర్టీసీ విలీనం- ఆంధ్రప్రదేశ్ అనుభవాలు అనే బుక్ లెట్ ను నలగొండ డిపోలో ఆవిష్కరించి అనంతరం ఆర్ ఎం శ్రీదేవి కి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ ఆర్టీసి కార్మికులు పారిశ్రామిక కార్మికులని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పని పరిస్థితులకు, ఆర్టీసి కార్మికుల పని పరిస్థితులకు పూర్తి తేడా వుంటుందని అన్నారు. ఆర్టిసి కార్మికులకు స్థిరమైన పద్ధతిలో పని దినం వుండదు. ఒక రోజు తెల్లవారుఝామున వెళితే, మరో రోజు మరో సమయంలో డ్యూటీకి వెళ్ళవలసి వస్తుంది. ఇంటి భోజనం తినడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. బయట హోటల్లోనే భోజనం చేయాలి. అలాగే పూర్తిగా ప్రమాదకరమైన పరిస్థితులలో కూడా ధైర్యంగా పని చేయాలి. అనుకోని పద్ధతిలో తమ తప్పు లేకపోయినా, ఎదుటివారి తప్పిదాల వలన జరిగే ప్రమాదాలలో కూడా తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తమ ప్రాణానికి ముప్పు ఏర్పడిందని తెలుస్తున్న సందర్భాలలో కూడా ప్రయాణీకులను సురక్షితంగా వుండేలా చూసి, స్టీరింగ్ పైనే తమ ప్రాణాలను విడిచిన ఘటనలు కార్మికుల వారి క్రమ శిక్షణకు, అంకిత భావానికి నిదర్శనాలు.అటువంటి క్లిష్టతర పరిస్థితిలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా వుండాలని 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (జులై 20, 21 - 2015) కూడా నిర్దేశించింది. కావున ఆర్టీసి కార్మికులకు 2017, 2021 సం॥లలో రావలసిన వేతన ఒప్పందాలను అమలు చేసి, ఆ పిమ్మట ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఎక్కువగా వుండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారుఅలాగే,65 సం॥రాల ఆర్టీసి ప్రస్తానంలో (ఉమ్మడి ఆర్టీసి గాను, టీఎస్ ఆర్టీసిగాను) కార్మికోద్యమం చేసిన ఆందోళనలు,ఐక్య పోరాటాలతో సంస్థను బ్రతికించుకోవడంతో పాటు, అనేక అలవెన్స్ లను, సౌకర్యాలను సాధించుకొన్నారు అవన్నీ కూడా పారిశ్రామిక వివాదాల చట్టం - సెక్షన్ 12 (3) క్రింద ఒప్పందం చేసుకొన్నా విలీనం అనంతరం కూడా ఆ అలవెన్స్లు,సౌకర్యాలను కొనసాగిస్తూనే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వున్న మెరుగైన సౌకర్యాలు, అలవెన్స్లు ఆర్టీసీ కార్మికులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్లగొండ రీజియన్ అధ్యక్షులు కందుల నరసింహ చంద్రమౌళి డిపో కార్యదర్శి బోడ స్వామి రీజియన్ సహాయ కార్యదర్శి శ్యాంసుందర్ ,సాధిక్ పాష , శ్రీరాములు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు
Aug 30 2023, 19:31