కామారెడ్డి పై సీఎం కేసిఆర్ నజర్ !
- అభివృద్ది పనులపై ఆదేశాలు
- జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్య నేతలు
- నిధుల కేటాయింపు ప్రక్రియ పూర్తి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్య వహిస్తున్న గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ చేయనున్నారు. దీంతో కామారెడ్డిపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. అక్కడ పెండింగ్ లో ఉన్న పనులన్ని ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయానికొచ్చింది. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తారన్న సమాచారంతో కేటీఆర్ కామారెడ్డికి కేటీఆర్ రూ.45 కోట్ల ఫండ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రూ.25 కోట్లతో ఏ పనులు చేపట్టాలో జీవో కూడా జారీ చేశారు.
కామారెడ్డి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రణాళిక గురించి కేసీఆర్ లేదా కేటీఆర్ అక్కడి అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అంతే కాదు కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు అధికారులు ప్రపోజల్స్ కూడా పంపారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు నీరందించేకు రూ.695 కోట్ల వ్యయంతో 3 రిజర్వాయర్లు నిర్మించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కేసీఆర్ ఇప్పటికే సమావేశమయ్యారు. కామారెడ్డి నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుకున్నారు.
కామారెడ్డి కీ కేసిఆర్ పోటితోనే మహర్దశ ?
కామారెడ్డిలో అభివృద్ధి పనులు పూర్తి కాలేదని నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాకుండా పలు శాఖల్లో పనులు పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గ ప్రజల అవసరాలపై రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులు నత్తనడక కొనసాగుతోన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ప్రాణహిత- చేవెళ్ల పథకంలో భాగంగా పనులు మొదలు పెట్టింది. సదాశివనగర్ మండలం భూంపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావిటీతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గల్లోని 90 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు.కాంగ్రెస్ ఉన్నప్పుడు భూంపల్లి వద్ద రిజర్వాయర్ తో పాటు 2 మెయిన్ కెనాల్స్ పనులు కొంత జరిగాయి. ఆ తర్వాత 2014 తర్వాత పనులు నత్తనడక సాగుతోన్నాయి. భూ సేకరణ, రిజర్వాయర్ల్ నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారులు పనులు ఆపేశారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలోనే 22 ప్యాకేజీ పనులకు మోక్షం లభించినట్లు అక్కడి వారు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి రూపురేకలు మారుతాయని అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో జరిగిన అభివృద్ది కామారెడ్డి జరుగుంతుదని ఆశపడుతున్నారు.
Aug 30 2023, 15:55