/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz హైదరాబాద్ టు బల్లార్ష పలు రైళ్ల కుదింపు Yadagiri Goud
హైదరాబాద్ టు బల్లార్ష పలు రైళ్ల కుదింపు

కాజీపేట రైల్వే జంక్షన్‌ బలార్ష సెక్షన్‌లో జరుగుతున్న మూడోలైన్‌ ఇంటర్‌ లాకింగ్‌, నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా మంగళవారం నుంచి ఇంటర్‌సిటీ, భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండు రైళ్లను బెల్లంపల్లి వరకు కుదిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

సెక్షన్‌లోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ రెండు ముఖ్య రైల్వేస్టేషన్లలో మూడోలైన్‌ పనులు జరుగుతున్నందున ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 26 వరకు హైదరాబాద్‌ సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ మధ్య నడిచే ఇంటర్‌సిటీ రైలు, సికింద్రాబాద్‌-బలార్ష మధ్య నడిచే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రాకపోకలను బెల్లంపల్లి వరకు కుదించి నడిపిస్తున్నట్లు చెప్పారు.

బెల్లంపల్లి-బలార్ష సెక్షన్‌ మూడో లైన్‌ పూర్తయ్యే దశలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ రైళ్ల సమయంలో ఎలాంటి మార్పులు లేకుండా బెల్లంపల్లి వరకు మాత్రమే నడిపిస్తున్నట్లు వివరించారు. వీటితో పాటుగా ఇంతకు ముందు రద్దు చేసిన రామగిరి, సింగరేణి, డోర్నకల్‌ ప్యాసింజర్‌, కాకతీయ రైళ్ల రద్దును అక్టోబర్‌ 2వ తారీకు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

రాఖీ పౌర్ణమి కి మహిళలకు అదిరిపోయే బహుమతులు

రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది.

ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు ఆక‌ర్షణీయ‌మైన రూ.5.50 లక్షల విలువగల బ‌హుమ‌తులు అందించి.. వారి ప‌ట్ల సంస్థ‌కున్న గౌర‌వభావాన్ని ప్ర‌క‌టించనుంది.

ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనుంది.

ఈ నెల 30, 31 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలి. ఆ డ్రాప్ బాక్స్ లను ఒక చోటికి చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు.

మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను వారు జరుపుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు వారు రాఖీలు కడుతుంటారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ నాడు.. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది.

ఈ నెల 30, 31 తేదిల్లో సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వాటిని వేయాలి. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేసింది. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోంది.

సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుంది.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు.

ఈ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు సంబంధించి పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు...

MP Komatireddy: నల్గొండ సీటు త్యాగం చేయడానికి సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

హైదరాబాద్‌: బీసీల కోసం నల్గొండ సీటును త్యాగం చేయడానికి సిద్ధమని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో ఆరు దరఖాస్తులు వచ్చాయని అందరి బలాబలాలు పరిశీలిస్తామని తెలిపారు..

సమర్థులైన వారికే టికెట్లు ఇస్తామన్నారు. పీఈసీ సభ్యులతో ఏఐసీసీ వన్‌ టూ వన్‌ మాట్లాడాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారని, ఆ ప్రతిపాదనకు అందరం ఆమోదించినట్టు తెలిపారు.

ఎన్నికల ముందు కేటీఆర్‌ అమెరికా పర్యటనలో ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని ఆరోపించారు..

Ministers Botsa: ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి.. ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది..!

జీపీఎస్ పై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం సృహుద్భావ వాతావరణంలో జరిగింది అని పేర్కొన్నారు.

మేం గేట్లు తెరిస్తే వైసీపీ ఉండదు అని చంద్రబాబు అన్నారు.. చంద్రబాబు ముసలి నక్క, జిత్తులమారివి అని రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడిచి చావుకు కారణం.. చంద్రబాబుకు బుర్ర పాడైపోయిందా?.. అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు..

వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమం పథకాల వల్లే ధైర్యంగా ఈ విషయం చెబుతున్నామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు సంయమనం పాటించాలి.. చంద్రబాబు మిమ్మల్ని అనటం, మాతో అనిపించుకోవడం దేనికి?.. వయస్సు కాదు మనిషికి ఆలోచన ఉండాలి అని ఆయన అన్నారు.

ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి కదా.. ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది.. ఢిల్లీలో ఎవరి గేట్ల ముందు ఎవరు తిరుగుతున్నారు? అనేది తెలుస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగులకు జగన్ సర్కార్ అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా.. సరే వెంటనే తీర్చేస్తామని ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Hyderabad: 12వేల మంది డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌ న్యూస్‌..

హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబరు 2న ఇళ్లను కేటాయించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు..

నగర పరిధిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ కోసం ఆన్‌లైన్ డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులతో మంత్రి వర్చువల్‌గా టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి.. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు..

తమ కల నెరవేరబోతున్న సందర్భంగా మంత్రితో మాట్లాడిన బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్‌, సైదాబాద్‌, యూసుఫ్‌గూడ, బేగంబజార్‌, బోరబండ, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన పలువురు లబ్ధిదారులు ఆంనదం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలి, ఆత్మగౌరవంతో గొప్పగా జీవించాలనే సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్‌, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించినట్టు మంత్రి తలసాని తెలిపారు.

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండో మైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు వివరించారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున 12 వేల మందిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. సెప్టెంబరు 2న లబ్ధిదారులకు జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్ల కాలనీల వద్ద పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇళ్లు కేటాయించారనేది అధికారులు తెలియజేస్తారన్నారు..

KA Paul: విశాఖలో సీఐ కాలర్ పట్టుకుని కేఏ పాల్ ఓవరాక్షన్..

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విశాఖపట్నంలో చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరుకుంది..

అయితే, పాల్ దీక్షను పోలీసులు భగ్నం చేసుందుకు రావడంతో ఆయన ఓవరాక్షన్ చేశాడు. తనకు వైద్యం అక్కర్లేదని, కేజీహెచ్ దగ్గర పోలీసులతో ఆయన గొడవకు దిగారు. అడ్డుకోబోయిన సీఐ కాలర్ ను కేఏ పాల్ పట్టుకున్నాడు. పోలీసులపై అరుస్తూ, కేకలు పెడుతూ నానా హంగామా చేశాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. వదిలిపెట్టాలని పాల్ గొడవకు దిగాడు. కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేఏ పాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను ఇవాళ ( మంగళవారం ) పోలీసులు భగ్నం చేశారు..

కేఏ పాల్ చేస్తున్న దీక్షా శిబిరం నుంచి ఆయనను బలవంతంగా పోలీసులు తరలించారు. అంబులెన్స్ ఎక్కించి కేజీహెచ్‌కు తీసుకుపోయారు. అయితే ఆసుపత్రికి లోపలికి వెళ్లకుండా గేటు దగ్గరే కేఏ పాల్ పోలీసులతో గొడవకు దిగాడు. ఆరోగ్యంగా ఉన్న తనను ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని పోలీసులను ఆయన ప్రశ్నించారు. తనను చంపేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆయన విమర్శించారు..

Amaravati: ఆర్‌-5 జోన్‌పై సెప్టెంబరు 1న సుప్రీంకోర్టులో విచారణ

దిల్లీ: ఆర్‌-5 జోన్‌ కేసుపై సెప్టెంబరు 1న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. రాజధాని పరిధిలోని ఈ జోన్‌లో నిర్మాణాలు నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే..

ఈకేసులో తమ వాదనలూ వినాలని అమరావతి రైతులు కేవియట్‌ దాఖలు చేశారు.

ఆర్‌-5 జోన్ కేసును జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. అమరావతి రాజధాని కేసుపైనా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం విచారణ జరుపుతోంది..

కెసిఆర్ పాలనలో శాంతి భద్రతలకు డొకలేదు: ఎమ్మెల్సీ కవిత

ప్రభుత్వానికి ప్రజలకు మద్య కులసంఘాలు వారధిగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం నిజామాబాద్ పట్టణంలోని పులాంగ్ ప్రాంతంలో గల విజయలక్ష్మి గార్డెన్లో పద్మశాలి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత,అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, నగర మేయర్ దండు నీతూ కిరణ్ ముఖ్య అతిదులుగా హాజరయ్యారు.

పద్మశాలీలు ఎమ్మెల్సీ కవితకు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కవిత మార్కండేయని చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలకు డోకా లేదన్నారు. గతంలో గ్రామాల్లో ఉన్న పద్మశాలీలు నిరుపేదలుగా ఉండడం దురదృష్టకరం అన్నారు. పద్మశాలీల కులవృత్తులు అంతరించి పోయాయి. వ్యవసాయ భూములు లేక చాలామంది విద్య వైపు వెళ్లి ఉన్నత స్థాయిలో నిలిచారనీ పద్మశాలీల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. బిగాల గణేష్ మూడవసారి శాసనసభ్యుడిగా పోటీ చేసేందుకు బిఆర్ఎస్ ప్రభు త్వం అభ్యర్థిగా ప్రకటించిందని రాబోయే ఎన్నికల్లో గణేష్ గుప్తకు అండగా ఉండి ఆశీర్వదించండనీ, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనీ కోరారు.

మార్కండేయ వారసు లైన పద్మశాలీలు ధర్మరాజుకు సందేహం వస్తే మార్కండేయని అడిగి పరిస్థితి ఉండేదని అలాంటి పద్మశాలీల అభ్యు న్నతే దేయంగా కృషి చేస్తున్నా మన్నారు. వ్యాపారం చేసుకునే వారికి శాంతిభద్రత ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు 60 ఏళ్లలో చూస్తే ఏదో గొడవ జరుగు తూ ఉండేదని, ఈ 9 ఏళ్లలో ఎలాంటి గొడవలు కొట్లాటలు లేకుండా లాండ్ ఆర్డర్ని శాంతియుతంగా నడిపించిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు....

ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ మద్యం దుకాణాల వేలం పాటలు

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓడిపోతానన్న భయంతోనే ఆరు నెలల ముందు వైన్ షాపులకు వేలంపాటలు నిర్వహించి కోట్ల రూపాయలు రాబట్టాడని విద్యార్థుల ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ లో నిర్లక్ష్యాన్ని ఎందుకు చూపుతున్నారో విద్యార్థి లోకానికి బహిరంగంగా తెలియజేయాలని,ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజి రెడ్డి సవాల్ విసిరారు.

మంగళవారం కరీంనగర్ పట్టణంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయి అనుకున్న ప్రజల ఆశల మీద కేసీఆర్ నీళ్లు చల్లారని గుర్తు చేశారు.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు విద్యార్థులకు మంజూరు చేయకపోవడంలో కెసిఆర్ యావత్ విద్యార్థి లోకాన్ని అవమాన పరిచినట్టేనని ఉన్నత చదువుల కోసం ఆరాటపడుతున్న విద్యార్థుల బతుకుల్లో దుమ్ముపోసారని విద్యార్థులు లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదని ముఖ్యమంత్రి ఆ సీట్లో ఉన్నాడంటే దానికి ప్రధాన కారణం విద్యార్థులేనని గుర్తు చేశారు

ఉన్నత విద్యను అభ్యసించడం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు సర్టిఫికెట్లు కావాలని కాలేజీల చుట్టూ తిరుగుతూ ప్రభుత్వం నుండి ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా రాలేదు కాబట్టి సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజీలు మొండికేడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అంబటి జోజి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులు ఇటు చదువు పట్ల అటు తల్లిదండ్రుల పరిస్థితుల పట్ల ఆలోచించి విద్యా శక్తిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు అభివృద్ధి సంక్షేమాన్ని మర్చిపోయిన సీఎం కేసీఆర్ భూములు అమ్ముకుంటూ మద్యం మళ్లీ ఏరుల పారించేందుకు వేలం పాటలు వేస్తూ డబ్బులు పోగు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుందన్నారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు.

ఈ విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల విజయ్ కుమార్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెద్దెల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

LPG cylinder: ఎల్పీజీ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. సిలిండర్‌పై రూ.200 తగ్గింపు

వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. గృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై (LPG cylinder) రూ.200 చొప్పున తగ్గించింది.

ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇంట్లో వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో రూ.1103గా ఉంది. తగ్గించిన తర్వాత రూ.903కి తగ్గనుంది. ఉజ్వల పథకం కింద వంట గ్యాస్‌ పొందిన వారికి సబ్సిడీ కింద రూ.200 ఇస్తుండగా.. తగ్గింపుతో వారికి రూ.400 మేర ప్రయోజనం చేకూరనుంది. అంటే వారికి గ్యాస్‌ సిలిండర్ రూ.703కే లభించనుంది. అలాగే, ఉజ్వల పథకం కింద కొత్తగా మరో 75 లక్షల కొత్త వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. కొత్తగా ఇవ్వనున్న కనెక్షన్లతో కలిపితే ఈ లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరనుంది..

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పలుమార్లు సవరించిన ఆయిల్‌ కంపెనీలు.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరను మాత్రం స్థిరంగా ఉంచాయి. చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున ఆయిల్‌ కంపెనీలు పెంచాయి. మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం..