ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ మద్యం దుకాణాల వేలం పాటలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓడిపోతానన్న భయంతోనే ఆరు నెలల ముందు వైన్ షాపులకు వేలంపాటలు నిర్వహించి కోట్ల రూపాయలు రాబట్టాడని విద్యార్థుల ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ లో నిర్లక్ష్యాన్ని ఎందుకు చూపుతున్నారో విద్యార్థి లోకానికి బహిరంగంగా తెలియజేయాలని,ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజి రెడ్డి సవాల్ విసిరారు.
మంగళవారం కరీంనగర్ పట్టణంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయి అనుకున్న ప్రజల ఆశల మీద కేసీఆర్ నీళ్లు చల్లారని గుర్తు చేశారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు విద్యార్థులకు మంజూరు చేయకపోవడంలో కెసిఆర్ యావత్ విద్యార్థి లోకాన్ని అవమాన పరిచినట్టేనని ఉన్నత చదువుల కోసం ఆరాటపడుతున్న విద్యార్థుల బతుకుల్లో దుమ్ముపోసారని విద్యార్థులు లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదని ముఖ్యమంత్రి ఆ సీట్లో ఉన్నాడంటే దానికి ప్రధాన కారణం విద్యార్థులేనని గుర్తు చేశారు
ఉన్నత విద్యను అభ్యసించడం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు సర్టిఫికెట్లు కావాలని కాలేజీల చుట్టూ తిరుగుతూ ప్రభుత్వం నుండి ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా రాలేదు కాబట్టి సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజీలు మొండికేడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అంబటి జోజి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు ఇటు చదువు పట్ల అటు తల్లిదండ్రుల పరిస్థితుల పట్ల ఆలోచించి విద్యా శక్తిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు అభివృద్ధి సంక్షేమాన్ని మర్చిపోయిన సీఎం కేసీఆర్ భూములు అమ్ముకుంటూ మద్యం మళ్లీ ఏరుల పారించేందుకు వేలం పాటలు వేస్తూ డబ్బులు పోగు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుందన్నారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల విజయ్ కుమార్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెద్దెల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Aug 29 2023, 20:12