గంగుల క్యాంప్ ఆఫీస్ ముట్టడి: మోహరించిన పోలీసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 5,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో కరీంనగర్ ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు మంగళవారం మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించారు.
విద్యార్థులు పెద్ద సంఖ్యలో మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి కొద్ది సేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.
పోలీసులు విద్యార్థి నాయకులను చెదరగొట్టి అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు, ఏబీవీపీ నాయకులకు గాయలయ్యాయి..
Aug 29 2023, 17:43