తెలుగు భాష ప్రాధాన్యతను పెంచిన పిడుగు
•నేడు తెలుగు భాష దినోత్సవం
అమ్మతో కష్టసుఖాలు పంచుకునే భాష ప్రస్తుత కాలంలో బరువైపోతోంది. కొత్త పదాల సృష్టి కరువైపోతోంది. ఒకప్పుడు భాషను నేలకు దించి సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి నేడు. తెలుగు భాష కనుమరువు అవుతూ ఇంగ్లీష్‌బాట పట్టే రోజులు ఉన్నాయి. ఎక్కడ చూసినా తెలుగు కాకుండా ఇంగ్లీష్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
అయితే గతంలో ఏపీ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి బోర్డు కూడా తెలుగులో ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే భాష కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాము.
కానీ గిడుగు రామ్మూర్తి ఏ ఉద్దేశంతో పోరాటం చేశారో.. ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది. అయితే ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.
తెలుగు భాష మాతృ భాషను పాఠశాలల్లోనూ సజీవంగా ఉంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలు తెలుగు భాష కనుమరుగు కాకుండా ఎంతో కృషి చేస్తున్నాయి.
ఈ సందర్బంగా వేమన, సుమతీ శతకాలు వంటి పద్యాలు, కవితలు, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, నృత్య పోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలు అందించి విద్యార్థులకు తెలుగు భాషపై మమకారం పెంచే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
Aug 29 2023, 11:49