Vizag: విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకారుల ఆందోళన
జగదాంబ సెంటర్(విశాఖపట్నం): నగరంలోని కంటైనర్ టెర్మినల్ (వీసీటీ) వద్ద మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. టెర్మినల్‌కు భూములు అప్పగించిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ధర్నాకు దిగారు..
దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
2002లో విశాఖ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు సమయంలో ఒక్కో కుటుంబానికి 60 గజాల ఇంటి స్థలం, రూ.లక్ష పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని.. వాటిని అధికారులు నెరవేర్చాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు.
ఆందోళనకారుల ధర్నా దృష్ట్యా కంటైనర్ టెర్మినల్‌కు వెళ్లే ప్రధాన మార్గాన్ని మార్గాన్ని పోలీసులు దిగ్బంధించారు. మత్స్యకారుల ఆందోళనకు తెదేపా, సీఐటీయూ నేతలు మద్దతు తెలిపారు. విశాఖ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు తాతాజీ, సీఐటీయూ నేత సుబ్బరావు తదితరులు పాల్గొన్నారు..
Aug 29 2023, 11:41