టీఎస్ సెట్ దరఖాస్తుకు రేపే తుది గడువు
 
ఉస్మానియా యూనివర్సిటీ: అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అలర్ట్..  రేపే టీఎస్ సెట్-2023 దరఖాస్తునకు గడువు ముగియనుంది. ఈ ఏడాదికి గానూ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు సంబంధించి ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 29వ తేదీతో ముగియనుంది. కాగా, రూ.1500 అపరాధ రుసుముతో వచ్చే నెల 4వ తేదీ వరకు, రూ.2000 అపరాధ రుసుముతో 9వ తేదీ వరకు, రూ.3000 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.
పరీక్షలను అక్టోబర్ 28, 29, 30వ తేదీల్లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 13, 14వ తేదీలలో దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.అక్టోబర్ 20వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
పీజీ ఉత్తీర్ణులైన వారు, పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు టీఎస్ సెట్ పరీక్ష రాసేందుకు అర్హులు. మొత్తం 29 సబ్జెక్టుల్లో సెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
పేపర్ -1ను 50 ప్రశ్నలకు నిర్వహించనుండగా, ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 100 మార్కులుంటాయి. పేపర్ -2లో 100 ప్రశ్నలుండగా, ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 3గంటల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఓసీలు 40 శాతం, రిజర్వేషన్ క్యాటగిరీలో 35 శాతం మార్కులు పొందితే క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారు. వివరాలకు www.telanganaset.org, www.osmania.ac.in వెబ్‌సైట్‌లను సంప్రదించవచ్చు...
Aug 29 2023, 11:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.6k