NLG: మెడికల్ కాలేజీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్గొండ: మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు AITUC ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కర్ణన్ కు మెమోరాండం అందజేశారు.
ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజిలో పనిచేసే కార్మికులకు నాలుగు నెలల అవుతున్నా, నేటికీ వేతనాలు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని అన్నారు. జీతాలు రాక ఇంటి కిరాయి, ఆటో కిరాయిలు భరించలేకపోతున్నారని అన్నారు.
వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి మరియు జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని దేవేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు జామీర్, అండాలు, చెంద్రమ్మ, స్వర్ణ, జానయ్య, విజయ, రేణుక, కవిత, చంద్రమ్మ, లింగయ్య, కోటేశ్వరి, సీత, లక్ష్మి, శిల్ప, స్వర్ణలత, కనకమహాలక్ష్మి, కరుణ శ్రీ, కోటేశ్వరి, శిల్ప, కృష్ణవేణి, కరుణ, ఇద్దమ్మ, మంగమ్మ, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.
Aug 29 2023, 11:17