NLG: 2వ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలి: ఏఐటియుసి డిమాండ్
నల్గొండ: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన రెండో ఏఎన్ఎంల సమ్మె నేడు 11వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని, తమతో చర్చలు జరిపి సమ్మెను విరివింపజేయాలని ఏఐటియుసి, రెండవ ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రత్నకుమారి ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత16 నుండి 20 ఏళ్లుగా రెండవ ఏఎన్ఎంలు నిర్విరామమంగా ఆరోగ్యవంతమైన సమాజం తయారు చేయడం కోసం పనిచేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎం లను అందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఏఎన్ఎం ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి సరికాదన్నారు. యూనిఫాం అలవెన్స్ కూడా ఇవ్వటం లేదని, ప్రభుత్వం టాబ్ లు ఇచ్చిన నెట్ బాలెన్స్ ఇవ్వటం లేదు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సయ్యద్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చెల్లం పాండు రంగా రావు, రెండవ ఏఎన్ఎం ల యూనియన్ జిల్లా కార్యదర్శి నర్సమ్మ, నాగమణి,వసంత, సులోచన, సుశీల, సుప్రియ, సుమతి, శోభ, సంతోష, భాగ్య, శైలజ, కవిత, అండాలు, సరళ, శకుంతల, ఇందిర రేణుక, గాయత్రి, సత్యమ్మ, పార్వతి, సాలమ్మ, గీత, శారద, విజయలక్ష్మి, రజిత, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Aug 28 2023, 21:25