ప్రభుత్వం ప్రకటించిన మోటారు సైకిళ్లను వెంటనే ఇవ్వాలి
•పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే పరిష్కారం చేయాలి
•చినపాక లక్ష్మీనారాయణ
రాష్ట్ర ప్రభుత్వం 2022లో భవన నిర్మాణ కార్మికులకు అసెంబ్లీలో ప్రకటించిన లక్ష మోటార్ సైకిళ్లను వెంటనే ఇవ్వాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్లగొండ జిల్లా లేబర్ అధికారి కార్యాలయం ముందు కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి గారు మే డే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటారు సైకిళ్ళు ఇస్తామని ప్రకటించి నేటికీ సంవత్సరం కావస్తున్న ఒక్క మోటార్ సైకిల్ కూడా ఇవ్వకపోవడం కార్మికుల పట్ల వారి కపట ప్రేమకు, చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. మోటార్ సైకిల్ వస్తుందని ఆశపడిన కార్మికునికి అడియాసే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మోటార్ సైకిల్ పంపిణీకి సంబంధించిన విధివిధానాలను రూపొందించి పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రమాదాలు, సహజ మరణాలు, పెళ్లి కానుక, ప్రసూతి సహాయం తదితర అనేక నష్టపరిహారాలు ఏ ఎల్ ఓ కార్యాలయాలలో కుప్పలు తిప్పలుగా పేరుకపోయాయని పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. కొత్తగా తీసుకువచ్చిన తంబు సిస్టం వలన కార్మికులు పనిచేసే చేతి వేళ్లపైన గీతలు అరిగిపోయి తంబులు రాకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఆలోచించి ఐరీస్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. సెప్టెంబర్ నెల 5వ తేదీన హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య భవన నిర్మాణ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కేశవులు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అద్దంకి నరసింహ పోలే సత్యనారాయణ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల జ్యోతి కాశమ్మ నాయకులు దయానంద్ సాగర్ల మల్లయ్య నీరుడు వీరయ్య గాదే యాదయ్య కాసర్ల సరిత బరిగల నరసింహ కాసర్ల వెంకన్న నారబోయిన సత్యనారాయణ గిరి శాంతి కుమార్ వెంకన్న సత్తయ్య నరసింహ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Aug 28 2023, 20:44