నగరిలో సీఎం జగన్ కామెంట్లు..
అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటారు. 28 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యాడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా కనిపిస్తుందా?. సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదు. అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నాడు.
చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు, మోసాలు. కుట్రలు, కుతంత్రాలనే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. రెచ్చగొట్టి గొడవలు పెట్టి.. శవరాజకీయాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశం. కావాలనే పోలీసులపై రాళ్లు రువ్వించారు. పోలీసులపై కర్ర, బీరు సీసాలతో దాడి చేయించాడు. ఓ పోలీస్‌కన్ను కూడా పోగొట్టారు.
చంద్రబాబు ఢిల్లీలో సీఈసీని కలుస్తాడట. దొంగ ఓట్లు ఆయనే సృష్టించి.. మన మీద ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లాడు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం వెనుకడాడని వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి.. ఆయన ఫొటోనే దండం పెడతాడు. ఎన్టీఆర్ నాణేం విడుదల కోసం ఢిల్లీ కూడా వెళ్లాడు.
సీఎం జగన్ ప్రసంగం
ప్రతి పేద కుటుంబానికి నేటి కంటే రేపు మరింత బాగుండాలి. తల్లిదండ్రుల పేదరికం పిల్లల భవిష్యత్తుకు అడ్డురాకూడదు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. పేద పిల్లలు ఇబ్బంది పడకూడదనే విద్యాదీవెన తీసుకొచ్చాం. ఇది వాళ్ల భవిష్యత్తు మార్చబోయే పథకం. నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ. 11 వేల మూడు వందల కోట్లు జమ చేశాం. 8 లక్షల 44 వేల 336 మంది మంది తల్లుల ఖాతాలో రూ.680 కోట్లు జమ చేస్తున్నాం. జగనన్న వసతి దీవెన కూడా పేద విద్యార్థలు కోసం అమలు చేస్తున్నాం.
Aug 28 2023, 15:41