సహనం కోల్పోతున్న బిఆర్ఎస్ నేతలు

రాజకీయాల్లో ముఖ్యంగా కావల్సింది సహనం బిఆర్ఎస్ నేతలు ఈమధ్య సహనం కోల్పోతున్నారు ఎంత సహనం ఉంటే అంతలా రాణిస్తారు. కానీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకో గానీ ఈ మధ్య పదే పదే సహనం కోల్పోతున్నారు.
మొన్నటికి మొన్న స్టీల్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఓ వ్యక్తిని తోసేసి ఓ వర్గం ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత క్షమాపణలు చెప్పారు. తాజాగా మరోసారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహనం కోల్పోయారు. భాగ్యనగర్ గణేష్ సమితి సెక్రెటరీ పై మండిపడ్డారు.
ఓల్డ్ సిటీలో మ్యాన్ హోల్స్, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వివరిస్తున్న సెక్రటరీ పై తలసాని అసహనం వ్యక్తం చేశారు. గత బోనాలల్లో సరైన ఏర్పాట్లు లేక మ్యాన్ హోల్స్ లో పడి భక్తులకు గాయాల పాలయ్యారంటు చెపుతున్న గణేష్ ఉత్సవ నిర్వహకులపై మరోసారి మండిపడ్డారు.
మొన్నటికి మొన్న మంత్రి హరీష్ రావు పై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు..


 
						







 


 
Aug 28 2023, 15:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.8k