కూతురు మరణం తట్టుకోలేక.. తండ్రి ఆత్మహత్య
అల్లారు ముద్దుగా పెంచిన కూతురు కండ్ల ముందే మృతి చెందటంతో ఆ తండ్రి హృదయం తట్టుకోలేకపోయింది.
గోరు ముద్దులు తినిపిస్తూ గుండెల మీద పెట్టుకొని ఎంతో గారాభంగా పెంచిన బిడ్డను మృత్యువు కబలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి..చిట్టితల్లీ నీవు లేని లోకంలో నేను ఉండలేనంటూ ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారకర సంఘటన నగరంలోని ఖైరతాబాద్‌లో సోమవారం చేటు చేసుకుంది.
ఖైరాతాబాద్‌కు చెందిన కిశోర్ ఐదేళ్ల కూతురు ఆరాధ్య అనారోగ్యంతో మృతి చెందింది. ఎంతో అపురూపంగా పెంచుకున్న బిడ్డ కండ్ల ముందే తనువు చాలించడంతో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి కిశోర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
తండ్రీ, కూతుళ్ల మరణం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని కిశోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు...








Aug 28 2023, 15:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.4k