తెలంగాణలో అభివృద్ధి కంటే వైన్స్ షాపులే గణనీయంగా పెరిగాయి : నయాగావ్ ఎమ్మెల్యే రాజేష్ పవర్
తెలంగాణలో అభివృద్ధి కంటే వైన్స్ షాపుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మహారాష్ట్ర నయాగావ్ ఎమ్మెల్యే రాజేష్ పవర్ అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని కుబీర్ చౌరస్తాలో గల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. అసెంబ్లీ ప్రవాస్ యోజన ముగింపు కార్యక్రమంలో భాగంగా వారం రోజులుగా పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలో పర్యటించానని అన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పథకాలను అమలు కాకుండా అడ్డుకుంటున్నారని తెలిసిందని పర్కొన్నారు.
తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని, ధరణితో బీఆర్ఎస్ కార్యకర్తలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
దళిత బంధు బీఆర్ఎస్ కార్యకర్తల బంధుగా తయారైందని అన్నారు. పోలీస్ వ్యవస్థతో సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గుండెగాం గ్రామ ముంపు సమస్య ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే తీర్చాక పోవడం బాధాకరమని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం బొస్లే మోహన్ రావు పటేల్, రామారావు పటేల్ ఆధ్వర్యంలో స్థానిక భైంసా మండలం ఎంపీడీవో కార్యాలయం నుంచి పట్టణంలో పలు రహదారుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు, తాలూకా నాయకురాలు పడకండి రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తాలూకా నాయకులు మోహన్ రావు పటేల్, రామారావు పటేల్,
భాజపా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు భూషణ్, శ్రీనివాస్, ముధోల్ తాలూకా పార్లమెంట్ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, నాయకులు బాజనోల్ల గంగాధర్, నారాయణ్ రెడ్డి, గాలిరవి, పోషెట్టి, దిలీప్, బాజీరావు, గౌతం పింగ్లే, పట్టణాధ్యక్షుడు మల్లేష్, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, తదితరులు హాజరయ్యారు....
Aug 28 2023, 10:24