/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png
నేడు ఎన్టీఆర్ రూ.100 నాణెం ఆవిష్కరణ
లెజెండరీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు చిత్రంతో రూపొందిన రూ.100 నాణేన్ని ఇవాళ రాష్ట్రపతి ముర్ము విడుదల చేయనున్నారు.
రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు..
SB NEWS
నీరజ్ చోప్రా సంచలనం వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కి స్వర్ణం..
హంగేరి: బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించాడు.
ఫైనల్ మ్యాచ్‌లో జావెలిన్‌ని 88.17 మీటర్ల దూరం విసిరి ప్రపంచంలోనే తనకు తిరుగులేదని నిరూపించాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు..
నిజామాబాద్ ఐటీ హాబ్ లో పెట్టుబడులకు మరో కంపెనీ గ్రీన్ సిగ్నల్
నిజామాబాద్ ఐటీ హబ్‌లో క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఆదివారం మంత్రి కేటీఆర్ అమెరికాలో కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు ఫౌండర్ అంజి మారం కంపెనీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నిజామాబాదులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కనెక్టివిటీ అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయని అందుకు రాబోయే రోజుల్లో సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రస్తుతం కాలిఫోర్నియా, హైదరాబాద్ మరియు విజయవాడలో కలిసి 1000 మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు.
ఈ భేటీలో ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎన్నారై, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి, గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఉన్నారు.......
సీఎం పదవి కాదు, ముందు డిపాజిట్ తెచ్చుకోండి.. అమిత్షాపై హరీశ్రావు ఆగ్రహం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా చేసిన కామెంట్స్పై ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎం పదవి సాధించడం కాదు.. మీరు ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి అని విమర్శలు గుప్పించారు.
మాకు నూకలు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పీయూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని మండిపడ్డారు.
బ్యాట్ సరిగ్గా పట్టడం చేతకాని మీ అబ్బాయిని ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసని అమిత్ షాను ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు అన్నారు.అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్ కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోక ముడిచిన మీరా.. రైతు బాంధవుడైన కేసీఆర్‌ను విమర్శించడం అని అన్నారు...
సీఎం కేసీఆర్ కు పెగ్గులు పడితేనే పథకాలు గుర్తొస్తాయి: బండి సంజయ్
ఖమ్మం వేదికగా జరిగిన రైతు ఘోష :బీజేపీ భరోసా బహిరంగ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్. దుబాయ్ అని బొంబాయి తీసుకుని పోయిన కేసీఆర్. కోడుకు పేరు అజయ్ రావు...టిక్కెట్ కోసం కేటిఆర్ పేరు పెట్టాడు.
ఎన్నికలు వస్తే దళిత బంధు, రుణ మాఫీ గుర్తుకు వస్తుంది. ఒక పెగ్గు వేస్తాడు దళిత బంధు...రెండు పెగ్గులు వేస్తే డబుల్ బెడ్ రూం అంటాడు. మూడు పెగ్గులు వేస్తే రుణ మాఫీ అంటాడు. అని బండి సంజయ్ కుమార్ సెటైర్లు విసిరాడు.
అవినీతి పరులైన వారికి అమిత్ షా చిచ్చరపిడుగు. తెలంగాణ గడ్డపై పౌరు షాన్ని నింపిన ఖమ్మం గడ్డ. తెలంగాణ లో రామరాజ్యం నిర్మిద్దాం." అని బండి సంజయ్ అన్నారు....
తెలంగాణలో అభివృద్ధి కంటే వైన్స్ షాపులే గణనీయంగా పెరిగాయి : నయాగావ్ ఎమ్మెల్యే రాజేష్ పవర్
తెలంగాణలో అభివృద్ధి కంటే వైన్స్ షాపుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మహారాష్ట్ర నయాగావ్ ఎమ్మెల్యే రాజేష్ పవర్ అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని కుబీర్ చౌరస్తాలో గల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. అసెంబ్లీ ప్రవాస్ యోజన ముగింపు కార్యక్రమంలో భాగంగా వారం రోజులుగా పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలో పర్యటించానని అన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పథకాలను అమలు కాకుండా అడ్డుకుంటున్నారని తెలిసిందని పర్కొన్నారు.
తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని, ధరణితో బీఆర్ఎస్ కార్యకర్తలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
దళిత బంధు బీఆర్ఎస్ కార్యకర్తల బంధుగా తయారైందని అన్నారు. పోలీస్ వ్యవస్థతో సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గుండెగాం గ్రామ ముంపు సమస్య ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే తీర్చాక పోవడం బాధాకరమని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం బొస్లే మోహన్ రావు పటేల్, రామారావు పటేల్ ఆధ్వర్యంలో స్థానిక భైంసా మండలం ఎంపీడీవో కార్యాలయం నుంచి పట్టణంలో పలు రహదారుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు, తాలూకా నాయకురాలు పడకండి రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తాలూకా నాయకులు మోహన్ రావు పటేల్, రామారావు పటేల్,
భాజపా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు భూషణ్, శ్రీనివాస్, ముధోల్ తాలూకా పార్లమెంట్ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, నాయకులు బాజనోల్ల గంగాధర్, నారాయణ్ రెడ్డి, గాలిరవి, పోషెట్టి, దిలీప్, బాజీరావు, గౌతం పింగ్లే, పట్టణాధ్యక్షుడు మల్లేష్, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, తదితరులు హాజరయ్యారు....
రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే నాయకులను నిలదిద్దాం
•పేరాల గోపి
నాగారం మండలం:
భవిష్యత్తులో తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే రాజకీయ పార్టీల నాయకులను నిలదీస్తామని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు ఈటూరు గ్రామవాసి పేరాల గోపి అన్నారు.
ఈ సందర్భంగా ఆదివారం మాట్లాడుతూ
నాగారం మండలం ఈటూరు గ్రామంలో 1985 లో వంద ఇందిరమ్మ ఇళ్లతో కూడిన (ఎస్సీ కొత్త కాలనీ ఏర్పడింది).
తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డ ప్రతి నాయకుడిని కూడా కాలనీకి కమ్యూనిటీ హాల్ ని నిర్మించమని అడుగుతూనే వచ్చాం.ప్రతి నాయకుడు కూడా ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి నిర్మాణం చేస్తామని చెప్పారు కానీ ఓట్లు అయిపోయాక ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా దాటవేశారు. ఈ దొంగ హామీలు ఇస్తూ పబ్బం గడుపుతున్నటువంటి అన్ని పార్టీల నాయకులను కాలనీ ప్రజలు ఓట్ల కొరకు కాలనీకి వచ్చే ప్రతి అభ్యర్థిని నిలదీస్తామన్నారు.
అభివృద్ధి కొరకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నమని చెపుతున్న నాయకులు బలమైన మాదిగ సామాజిక వర్గంకి చెందిన ఉమ్మడి ప్రయోజనం అయిన కమ్యూనిటీ హల్ ఎందుకు నిర్మాణం చేయలేకపోతున్నారో ఆలోచించుకుని సిగ్గుపడలన్నారు.రాజకీయం అంత వ్యాపారం అయిందని ఒట్లకి ముందు కోట్లు పెట్టుబడి పెడితే అంతకు పదింతలు ఎక్కువ రాబట్టాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చి కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. భవిష్యత్ ఎన్నికల్లో గ్రామపంచాయతీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు పార్లమెంటరీ ఎన్నికల వరకు రాజకీయ నాయకులను నిలదీస్తామన్నారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం: ఖమ్మం సభలో అమిత్ షా
ఖమ్మంలో రైతు గోస బీజేపీ భరోసా బహిరంగ సభ జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రసంగించారు. తెలంగాణలో డబులింజన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని, సీఎం కేసీఆర్ని సాగనంపాలని అన్నారు.
అమిత్షా హిందీ ప్రసాంగానికి పార్టీ సీనియర్ నేత కే. లక్ష్మణ్ తెలుగు అనువాదం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్పై అమిత్షా మండిపడ్డారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..
బీజేపీకి ప్రజలు మద్దతు ఇవ్వాలి. హైదరాబాద్ విముక్తికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. కేసీఆర్ సర్కార్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ 75 విముక్తి దినోత్సవం త్వరలోనే రాబోతోంది. ఓవైసీతో కలిసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని అవమానించారు.
కేసీఆర్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రజాకార్ల పక్కన కూర్చొని పరిపాలిస్తోంది. ఇక.. ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేసీఆర్ గద్దె దిగిపోవాల్సిందే. సంపూర్ణ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుంది.
దక్షిణ అయోధ్యగా భద్రాచలం పేరుగాంచింది. భద్రాచలం రాముడికి ముత్యాల తలంబ్రాలు సమర్పించడం సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని కేసీఆర్ విడిచిపెట్టారు.
కారు భద్రాచలం వస్తుంది కానీ రాముడి వద్దకు రాదు బిజెపి సర్కారు వస్తే కమలాన్ని రాముడి పాదాల దగ్గర సమర్పిస్తాం, కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా? కేసీఆర్ను మళ్లీ సీఎం చేస్తారా.? మజ్లిస్ చేతిలో ఉన్న కేసీఆర్ను మళ్లీ సీఎం చేస్తారా? అంటూ ప్రశ్నించారు.
బీజేపీ నేతలపై దాడులు చేస్తే వాళ్లు ఆగిపోతారని అనుకుంటున్నారు. ఈటెల రాజేందర్ను అసెంబ్లీ నుంచి బయటికి పంపించారు. ఎన్నో పథకాల పేరుతో ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు.
ఇక.. కాంగ్రెస్ పార్టీ ఆనాడు రైతుల కోసం 22వేల కోట్ల బడ్జెట్ మాత్రమే పెడితే.. ఇవ్వాల ప్రధాని మోదీజి రైతుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం లక్షా 25వేల కోట్ల బడ్జెట్ పెట్టారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని అరెస్టు చేశారని గుర్తు చేశారు...
కాంగ్రెస్ పార్టీ వైపు కమ్యూనిస్టుల చూపు?
తెలంగాణలో ఎన్నికల రానున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీతో పొత్తుల విషయంలో కటీఫ్ చెప్పిన విషయం తెలిసిందే.
మునుగోడు తర్వాత రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్తామని, తాము ఆశించిన అన్ని స్థానాలను కేసీఆర్ పొత్తులో భాగంగా తమకు కేటాయిస్తారని వామపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఇటీవల కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.
కనీసం వామపక్ష పార్టీల నేతలను సంప్రదించకుండానే లిస్ట్ ప్రకటించడంపై వామపక్ష నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పొత్తుల విషయంలో మోసం చేశారని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి.
మరో వైపు కలిసి వచ్చే పార్టీలతో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు పరోక్షంగానే ఇరు పార్టీలు ఓకే చెప్పాయి. కానీ ఒక్క బీజేపీకి మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి.
వామపక్షాల నాయకులకు థాక్రే ఫోన్లో సంప్రదింపులు
తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు కమ్యూనిస్టులు చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది.
కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించేందుకు వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని వామపక్షాలకు దగ్గర కావాలని టీ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది...
Aug 28 2023, 10:22