రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే నాయకులను నిలదిద్దాం
•పేరాల గోపి
నాగారం మండలం:
భవిష్యత్తులో తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే రాజకీయ పార్టీల నాయకులను నిలదీస్తామని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు ఈటూరు గ్రామవాసి పేరాల గోపి అన్నారు.
ఈ సందర్భంగా ఆదివారం మాట్లాడుతూ
నాగారం మండలం ఈటూరు గ్రామంలో 1985 లో వంద ఇందిరమ్మ ఇళ్లతో కూడిన (ఎస్సీ కొత్త కాలనీ ఏర్పడింది).
తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డ ప్రతి నాయకుడిని కూడా కాలనీకి కమ్యూనిటీ హాల్ ని నిర్మించమని అడుగుతూనే వచ్చాం.ప్రతి నాయకుడు కూడా ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి నిర్మాణం చేస్తామని చెప్పారు కానీ ఓట్లు అయిపోయాక ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా దాటవేశారు. ఈ దొంగ హామీలు ఇస్తూ పబ్బం గడుపుతున్నటువంటి అన్ని పార్టీల నాయకులను కాలనీ ప్రజలు ఓట్ల కొరకు కాలనీకి వచ్చే ప్రతి అభ్యర్థిని నిలదీస్తామన్నారు.
అభివృద్ధి కొరకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నమని చెపుతున్న నాయకులు బలమైన మాదిగ సామాజిక వర్గంకి చెందిన ఉమ్మడి ప్రయోజనం అయిన కమ్యూనిటీ హల్ ఎందుకు నిర్మాణం చేయలేకపోతున్నారో ఆలోచించుకుని సిగ్గుపడలన్నారు.రాజకీయం అంత వ్యాపారం అయిందని ఒట్లకి ముందు కోట్లు పెట్టుబడి పెడితే అంతకు పదింతలు ఎక్కువ రాబట్టాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చి కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. భవిష్యత్ ఎన్నికల్లో గ్రామపంచాయతీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు పార్లమెంటరీ ఎన్నికల వరకు రాజకీయ నాయకులను నిలదీస్తామన్నారు.
Aug 27 2023, 18:39