కాంగ్రెస్, బీజేపీ పార్టోల్లు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త:గంగుల
కరీంనగర్ జిల్లా :ఆగస్టు 26
కాంగ్రెస్, బీజేపీలు మోసకారి పార్టీలని, ఒక్క అవకాశం అంటూ వచ్చే ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే దివ్యాంగుల పెన్షన్లు కూడా ఎత్తుకు పోతారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులను చిన్నచూపు చూశాయన్నారు. దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో దివ్యాంగులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు.
కరీంనగర్‌లో శనివారం మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు. దివ్యాంగుల కళ్ళల్లో ఆనందమే సీఎం కేసీఆర్ కోరుకుంటారన్నారు. కరీంనగర్ జిల్లాలో 23 వేల మంది దివ్యాంగులకు రూ.11.85 కోట్ల పెన్షన్ చెల్లిస్తున్నామని వెల్లడించారు.
దేశంలో ఒంటరి మహిళలకు, డయాలసిస్ పేషెంట్లకు, బీడీ, టేకేదార్లకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో శాంతి భద్రతలు క్షినిస్తాయని చెప్పారు. 30, 40 కేసులు ఉన్నవాళ్లు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. తస్మాత్ జాగ్రత్త, భవిష్యత్ తరాల బాగు కోసం మనసున్న మారాజు సీఎం కేసీఆర్‌ను కాపాడుకోవాలని కోరారు.
కులవృత్తులకు పూర్వవైభవం..
సమైక్య రాష్ట్రంలో ధ్వంసమైన కులవృత్తులకు సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీసుకొచ్చారని మంత్రి గంగుల అన్నారు.
దిగువ మానేరు జలాశయంలో 100 శాతం సబ్సిడీపై ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. 2014 నుంచి ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో రూ.12.35 కోట్ల విలువైన చేపపిల్లలను ఉచితంగా అందించామన్నారు.
ఇప్పటి వరకు 50 వేల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందని చెప్పారు. నీలి విప్లవం వల్ల తెలంగాణ చేపల దిగుమతి స్థాయి నుంచి ఎగుమతి స్థాయికి చేరిందని వెల్లడించారు. కులవృత్తులకు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణలో రివర్స్ మైగ్రేషన్ జరిగిందని తెలిపారు..
Aug 26 2023, 18:30