నోటిఫికేషన్ కాపీలను దహనం చేసిన ఏఎన్ఎంలు
జగిత్యాల జిల్లా:ఆగస్టు 24
తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని తొమ్మిది రోజులుగా దీక్షలు చేస్తున్న రెండో ఏఎన్ఎంలు ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏఎన్ఎంల రిక్రూట్ మెంట్ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కాపీలను గురువారం దీక్ష శిబిరం ఎదుట దహనం చేశారు. అనంతరం ఏఐటీయూసీ అనుబంధ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్ల మధురిమ మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న తమని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
ఆర్టీసీ కార్మికులను,వీఆర్ఏ, పంచాయితీ కార్యదర్శులను కాంట్రాక్ట్ లెక్చలర్లను రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు విస్మరించిదో అర్థం కావడం లేదన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సర్వీస్ చేసామని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఇతర శాఖల్లో చేసిన మాదిరిగానే ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేసి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంల పక్షాన మధురిమ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సుప్రియ, నీరజ, పద్మ,రాజమని, మేరీ, ఎలిజబెత్, శిరీష, ప్రశాంతి, శైలజ, శిరీష, శారద, జమున, జయప్రద, చిలుకమ్మ, విజయలక్ష్మి, మహేశ్వరి, సుజాత, సరోజ, సుగుణ, ఊర్మిల, సమత, రాధ, ప్రశాంతి, సునీత, రమాదేవి, లక్ష్మికాంత, రజిత, సౌజన్య, పుష్ప, స్వరూప, సుమలత, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు....
Aug 25 2023, 09:28