మలక్పేట యశోద ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్ కు అరుదైన చికిత్స
•క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసిన వైద్య బృందం
నల్లగొండ :హైదరాబాదులోని మలక్‌పేట యశోద ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్ కు అరుదైన చికిత్స చేసి యువకుడి ప్రాణాలు కాపాడినట్లు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ గోరుకంటి పవన్, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎల్ రోహిత్ రెడ్డిలు తెలిపారు.
గురువారం జిల్లా కేంద్రంలో మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నిరంతరం జ్వరం, రక్త స్రావంతో బాధపడుతూ ఆసుపత్రికి రాగా అతడికి పరీక్షలు జరిపి ఆక్యూట్ మై లో ఈడు లుకేమియా బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు.
వెంటనే అతడికి ఆప్యాధునిక వైద్య పరికరాలతో ఐదు రౌండ్ల కీమోథెరపీ చేసి , బ్లడ్ నుండి క్యాన్సర్ ను వేరు చేసి, ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. ప్రాణాంతకమైన వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటని, దానికి మెరుగైన వైద్యం, నిరంతర వైద్య పర్యవేక్షణ చాలా ముఖ్యమన్నారు . క్యాన్సర్ వచ్చినా కూడా ప్రాణాలు కాపాడుకోవచ్చని వారు తెలిపారు. క్యాన్సర్ అనగానే భయపడవద్దు అన్నారు. ఈ సమావేశంలో మలక్పేట యూనిట్ హెడ్ కే శ్రీనివాస్ రెడ్డి, జనరల్ మేనేజర్ చిరుద. శ్రీనివాస్ , సిబ్బంది వాసు కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Aug 24 2023, 20:06