NLG: రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయండి: మునాస ప్రసన్న
ఉమ్మడి నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ కు చెందిన గంగపుత్ర ముద్దుబిడ్డ దీటి మల్లయ్య, గంగపుత్ర సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ, జాతి మనగడే లక్ష్యంగా గత 40 సంవత్సరాలుగా నిస్వార్థ సేవ చేస్తున్న, కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీత, తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర కార్యాచరణ సమితి చైర్మన్ ను, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా ప్రకటించారు.
ఈనెల 25న శుక్రవారం నాడు హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్, శాంతినగర్ వద్ద గల మత్స్యశాఖ భవన ప్రాంగణంలో దీటి మల్లయ్య తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సమాఖ్య చైర్మన్, ప్రత్యేక కార్యదర్శి, మత్స్యశాఖ కమిషనర్ ,మత్స్యశాఖ అధికారులు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా నేడు తెలంగాణ గంగపుత్ర సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న దీటి మల్లయ్య కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నల్గొండ పట్టణంలోని తెలంగాణ గంగపుత్ర సంఘ జిల్లా కార్యాలయంలో, ఈ నెల 25న హైదరాబాద్ లోని మత్స్య భవన్‌లో జరిగే ప్రమాణ స్వీకారానికి జిల్లా గంగపుత్ర సంఘ సభ్యులు , మత్స్య సంఘం సభ్యులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరుచూ కరపత్రాన్ని ఆవిష్కరించి ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా గౌరవాధ్యక్షుడు పిల్లి సత్తయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు సింగం వెంకటయ్య, గౌరవ సలహాదారుడు ( Besta) మునసు వెంకన్న, ప్రధాన కార్యదర్శి మంగిలిపల్లి కిషన్, ఉపాధ్యక్షుడు వడ్డెబోయిన అంజయ్య,జిల్లా అధికార ప్రతినిధి వద్దబోయిన సైదులు, మీడియా కన్వీనర్ మరియు యువజన అధ్యక్షుడు అంబటి ప్రణీత్, ప్రచార కార్యదర్శి మనాస వెంకన్న, కోశాధికారి సింగం దుర్గయ్య, కార్యదర్శి మంగలిపల్లి శంకర్ , రాసమల్ల యాదగిరి, కందరబోయిన నాగయ్య, కోరేపల్లి కొండల్, కందరబోయిన శ్రీను, అంబటి రాజశేఖర్, అంబటి శివకుమార్, వడ్డెబోయిన పురుషోత్తం, మునాస నాగరాజు, మునాస వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Aug 24 2023, 18:47