రెండవ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలి: మేడి ప్రియదర్శిని
నల్లగొండ: ప్రభుత్వం విడుదల చేసిన ఏఎన్ఎం ల నోటిఫికేషన్ రద్దు చేసి ఎటువంటి పరీక్షలు లేకుండా రెండవ ఏఎన్ఎం లను వెంటనే రెగ్యులర్ చేయాలని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏఎన్ఎం లు చేపట్టిన నిరవధిక సమ్మెలో పాల్గొని, వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు కానీ వారి ఆశలు నెరవేరలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుండి దాదాపు 20 సంవత్సరాల నుండి ఎంపిహెచ్ఎ లకు సమానంగా విధులు నిర్వహిస్తూ సేవలందిస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత లేకున్నా ఏదో ఒక రోజు రెగ్యులర్ చేస్తారనే నమ్మకంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సం. లుగా ఎదురుచూస్తున్నారని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కుటుంబాలకు దూరంగా ఉంటూ, వ్యాధిగ్రస్తులకు దగ్గర ఉన్న సమయంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయినా.. ప్రాణాలు లెక్క చేయకుండా ప్రతి నిత్యం అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రెండవ ఏఎన్ఎం లను ఎటువంటి పరీక్షలు లేకుండా వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, రెండవ ఏఎన్ఎం సామ సునీత, యాతకుల మాధవి, రూప, శ్రీలత,అరుణ, విజయ్ జయలక్ష్మి, వసంత, మాదవి, మల్లిక తదితరులు పాల్గొన్నారు.
Aug 23 2023, 17:09