/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz మర్రిగూడ: ముదిరాజులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం అన్యాయం: గణేష్ Mane Praveen
మర్రిగూడ: ముదిరాజులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం అన్యాయం: గణేష్
బిఆర్ఎస్ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు.. నిన్న ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో, ముదిరాజులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం అన్యాయమని, లెంకలపల్లి గ్రామానికి చెందిన దాసరి గణేష్, మర్రిగూడ మండల ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (MEPA) అధ్యక్షులు  మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో ముదిరాజ్ బిడ్డలు రెండో స్థానంలో ఉండగా వారికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం ముదిరాజ్ బిడ్డలను అవమానించడమే అని అన్నారు.

ఇకనైనా ముదిరాజ్ బిడ్డలు మేలుకొని, మన సత్తా ఏంటో చాటి చూపిద్దామని ముదిరాజ్ బిడ్డలకు పిలుపునిచ్చారు. ముదిరాజుల ఐక్యతను చాటాలని, రానున్న ఎలక్షన్లలో ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించేలా తగు చర్యలు చేపట్టాలని అన్నారు.
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
యాదాద్రి జిల్లా:  భువనగిరి లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు 1 కోటి 43 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా మంజూరైన భవన నిర్మాణానికి, సోమవారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
TS: పెండింగ్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలు

బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, సోమవారం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించారు. 119 నియోజకవర్గాలకు గాను 115 అభ్యర్థులను ప్రకటించారు. నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు చేయలేదు. పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
1. నాంపల్లి 2. నర్సాపూర్ 3. జనగామ 4. గోషామహాల్ టికెట్ మిస్సైన  బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు:
సుభాష్ రెడ్డి - ఉప్పల్,
రాజయ్య - స్టేషన్ ఘనపూర్
రాములు నాయక్ - వైరా
రేఖా నాయక్ - ఖానాపూర్
చెన్నమనేని రమేష్ - వేములవాడ
గంప గోవర్ధన్ -కామారెడ్డి
రాథోడ్ బాపురావు -బోధ్
విద్యాసాగర్ రావు - కోరుట్ల ( అభ్యర్థిగా  కుమారుడు)
లెంకలపల్లి: బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని ప్రకటించినందుకు సంబరాలు జరిపిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు

నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి మరోసారి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ప్రకటించినందుకుగాను సోమవారం మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో, లెంకలపల్లి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రేణికుంట్ల నరేందర్ ఆధ్వర్యంలో.. బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరోసారి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల బిఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలని, కూసుకుంట్ల నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

TS: బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్


తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను, 115 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను సోమవారం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ ప్రకటించారు. వివరాలు ఇలా ఉన్నాయి 1. సిర్పూర్ - కోనేరు కన్నప్ప

2. చెన్నూర్ (ఎస్సీ) - బాల్క సుమన్

3. బెల్లంపల్లి (ఎస్సీ) - దుర్గం చిన్నయ్య

4. మంచిర్యాల - నడిపల్లి దివాకర్ రావు

5. ఆసిఫాబాద్ (ఎస్టి) - కోవలక్ష్మి

6. ఖానాపూర్ (ఎస్టీ) - భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్

7.ఆదిలాబాద్ - జోగు రామన్న

8.బోధ్ - ఎస్టి అనిల్ యాదవ్

9.నిర్మల్ - అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

10. ముధోల్ - గడ్డిగారి విటల్ రెడ్డి

11. ఆర్మూర్ - ఆశన్నగారి జీవన్ రెడ్డి

12.బోధన్ - మహమ్మద్ షకీల్ అమీర్

13. జుక్కల్ (ఎస్సీ) - హనుమంత్ షిండే

14. బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి

15.ఎల్లారెడ్డి - జాజల సురేందర్

16. కామారెడ్డి - కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)

17. నిజామాబాద్ (అర్బన్)- బిగాల గణేష్ గుప్తా

18. నిజామాబాదు (రూరల్) - గోవర్ధన్ బాజిరెడ్డి

19. బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి

20. కోరుట్ల - డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల

21. జగిత్యాల - ఎం. సంజయ్ కుమార్

22. ధర్మపురి (ఎస్సీ)- కొప్పుల ఈశ్వర్

23. రామగుండం -కోరుకంటి చందర్

24. మంథని - పుట్ట మధు

25. పెద్దపల్లి దాసరి -:మనోహర్ రెడ్డి

26. కరీంనగర్ - గంగుల కమలాకర్

27.చొప్పదండి (ఎస్సీ) - సుంకే రవిశంకర్

28.వేములవాడ- చెలిమెడ లక్ష్మీనరసింహారావు

29. సిరిసిల్ల - కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)

30. మానకొండూరు- ఏర్పుల బాలకిషన్ (రసమయి)

31. హుజురాబాద్ - పాడి కౌశిక్ రెడ్డి

32. హుస్నాబాద్ - వోడితెల సతీష్ కుమార్

33. సిద్దిపేట్ - తన్నూరి హరీష్ రావు

34. మెదక్ - ఎం. పద్మాదేవేందర్ రెడ్డి

35. నారాయణఖేడ్ -మనోహర్ భూపాల్ రెడ్డి

36. ఆందోల్ (ఎస్సీ)- చంటి క్రాంతి కిరణ్

37. నర్సాపూర్....

38.జహీరాబాద్ (ఎస్సీ)- కొన్నింటి మాణిక్ రావు

39. సంగారెడ్డి - చింత ప్రభాకర్

40. పటాన్ చెరువు - గూడెం మహిపాల్ రెడ్డి

41. దుబ్బాక - కొత్త ప్రభాకర్ రెడ్డి

42. గజ్వేల్ - కె. చంద్రశేఖర రావు కేసీఆర్

43. మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి

44.మల్కాజ్గిరి - మైనంపల్లి హనుమంతరావు

45. కుతుబుల్లాపూర్ - కూనపండు వివేకానంద్

46. కూకట్ పల్లి - మాధవరం కృష్ణారెడ్డి

47. ఉప్పల్ - బండారు లక్ష్మారెడ్డి

48. ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి

49. ఎల్బీనగర్ - దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

50. మహేశ్వరం - పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి

51. రాజేంద్రనగర్ - తోల్కంటి ప్రకాష్ గౌడ్

52. శేరిలింగంపల్లి - ఆర్కేపూడి గాంధీ

53. చేవెళ్ల (ఎస్సీ)- కాలే యాదయ్య

54. పరిగి - కొప్పుల మహేష్ రెడ్డి

55. వికారాబాద్ (ఎస్సీ) - డాక్టర్ మెతుకు ఆనంద్

56. తాండూర్ - పైలెట్ రోహిత్ రెడ్డి

56. ముషీరాబాద్ - మూట గోపాల్

57. మలక్ పేట - తీగల అజిత్ రెడ్డి

58. అంబర్ పేట - కాలేరు వెంకటేష్

59.ఖైరతాబాద్ - దానం నాగేందర్

60.జూబ్లీహిల్స్ - మాగంటి గోపీనాథ్

61. సనత్ నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్

62. నాంపల్లి.....

63. కార్వాన్- అయిందల కృష్ణయ్య

64. గోషామహల్....

65. చార్మినార్ - ఇబ్రహీం లోడి

66. చాంద్రాయణగుట్ట - సీతారాం రెడ్డి

67. యాకుత్ పురా - సామ సురేందర్ రెడ్డి

68.బహదూర్ పుర - అలీ బక్రీ

69. సికింద్రాబాద్ - టి.పద్మారావు

70. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) -జి. లాస్యనందిత

71. కొడంగల్ - పట్నం నరేందర్ రెడ్డి

72. నారాయణపేట- ఎస్.రాజేందర్ రెడ్డి

73. మహబూబ్నగర్ - శ్రీనివాస్ గౌడ్ విరుసన్నుల

74. జడ్చర్ల - చార్లకోల లక్ష్మారెడ్డి

75. దేవకద్ర - అల్ల వెంకటేశ్వర రెడ్డి

76. మక్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి

77. వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

78. గద్వాల్ - బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

79. అలంపూర్ (ఎస్సీ) - వి.ఎం అబ్రహం

80. నాగర్ కర్నూల్ - మర్రి జనార్దన్ రెడ్డి

81. అచ్చంపేట (ఎస్సీ)- గువ్వల బాలరాజు

82. కల్వకుర్తి - గురక జైపాల్ యాదవ్

83. షాద్ నగర్ - అంజయ్య ఎల్గనమొని

84. కొల్లాపూర్ - బీరం హర్షవర్ధన్ రెడ్డి

85. దేవరకొండ (ఎస్టి) - రవీంద్ర కుమార్ రమావత్

86. నాగార్జునసాగర్ - నోముల భగత్

87. మిర్యాలగూడ -నల్లమోతు భాస్కరరావు

88. హుజూర్నగర్ - శానంపూడి సైదిరెడ్డి

89.కోదాడ - బొల్లం మల్లయ్య యాదవ్

90. సూర్యాపేట - గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

91. నల్లగొండ - కంచర్ల భూపాల్ రెడ్డి

93. మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

94. భువనగిరి - పైళ్ళ శేఖర్ రెడ్డి

95. నకిరేకల్ (ఎస్సీ)- చిరుమర్తి లింగయ్య

96. తుంగతుర్తి (ఎస్సీ) - గాదరి కిషోర్ కుమార్

97. ఆలేరు - గొంగిడి సునీత

98. జనగాం.....

99. స్టేషన్ ఘన్ పూర్(ఎస్సీ)- కడియం శ్రీహరి

100. పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర్ రావు

101. డోర్నకల్ - డిఎస్ రెడ్యా నాయక్

102. మహబూబాబాద్( ఎస్టి )- బానోత్ శంకర్ నాయక్

103. నర్సంపేట్ - పెద్ది సుదర్శన్ రెడ్డి

104. పరకాల - చల్ల ధర్మారెడ్డి

105. వరంగల్ (వెస్ట్)- దాస్యం వినయ భాస్కర్ రెడ్డి

106. వరంగల్ (ఈస్ట్) - నన్నపునేని నరేందర్

107. వర్ధన్నపేట (ఎస్సీ)- ఆరూరి రమేష్

108. భూపాలపల్లి - గండ్ర వెంకట రమణారెడ్డి

109. ములుగు (ఎస్టి)- బాదే నాగజ్యోతి

110. పినపాక (ఎస్టి) - రేగ కాంతారావు

111. ఎల్లందు (ఎస్టీ)- బానోత్ హరిప్రియ నాయక్

112. ఖమ్మం -పువ్వాడ అజయ్ కుమార్

113. పాలేరు - కందాల ఉపేందర్ రెడ్డి

114. మధిర (ఎస్సీ)- లింగాల కమల్ రాజ్

115. వైరా (ఎస్టి)- బానోత్ మదన్ లాల్

116. సత్తుపల్లి (ఎస్సీ)- సండ్ర వెంకట వీరయ్య

117. కొత్తగూడెం - వనామ వెంకటేశ్వరరావు

118. అశ్వరావుపేట (ఎస్టి) - మెచ నాగేశ్వరరావు

119. భద్రాచలం (ఎస్టి)- డాక్టర్ తెల్లం వెంకటరావు

NLG: మానవత్వం చాటుకున్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన అన్నం కృష్ణ ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందడం జరిగింది.  అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆదివారం బాధిత  కుటుంబానికి ఆర్థిక సహాయంగా 2 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Mane Praveen

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం 9 సం.ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-1 ప్రారంభోత్సవంలో పాల్గొన్న బి

ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-1 ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిజెపి నాయకురాలు కన్మంత రెడ్డి శ్రీదేవి
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం 9 సం.ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-1 ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిజెపి నాయకురాలు కన్మంత రెడ్డి శ్రీదేవి
మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న నల్లగొండ ఫోటో జర్నలిస్టులు
HYD: వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా నల్లగొండ జిల్లా ది హన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో 2022 పల్లె ప్రగతి ఫోటోకు, 2023 తెలంగాణ పండుగలు ఫోటోకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల విజయ్ కు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆదివారం నాడు  రవీంద్రభారతిలో ఆర్థిక శాఖ మరియు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టిపిజేఏ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ చేతుల మీదుగా ముచ్చర్ల శ్రీనివాస్ అవార్డు ను అందుకున్నారు. సూర్యాపేటలో నేడు సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉన్నందున ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల విజయ్ ఆ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల, ఆయన బదులుగా వారి కుమారుడు అఖిల్ గౌడ్ అవార్డును అందుకున్నారు.
HYD: విద్యార్థినీల చదువుకు ఎమ్మెల్సీ కవిత కుమారుల చేయూత
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత కుమారులు ఆదిత్య, ఆర్యా చిన్న వయస్సులోనే పెద్ద మనస్సును చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవల ఆదిత్య, ఆర్యా కలిసి మొదలుపెట్టిన సినర్జీ ఆఫ్ మైండ్స్ (ఎస్ఓఎం) ఫౌండేషన్ ద్వారా ఆడబిడ్డల చదవుకు చేయుతనిచ్చారు. హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కాలేజీలో అడ్మిషన్ లభించి, ఆర్థికంగా వెనుకబడిన 10 మంది విద్యార్థినీలకు ఫౌండేషన్ నుండి స్కాలర్ షిప్ లను వారు అందజేశారు. 10 మంది విద్యార్థినీలలో ఆరుగురు అండర్ గ్రాడ్యుయేట్, ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేట్  విద్యార్థులు ఉన్నారు. ఈ మేరకు కాలేజీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కాలేజీ ప్రతినిధుల సమక్షంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ను ఆదిత్యా, ఆర్యా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ... మహిళా సాధికారతకు తాము ఎప్పుడూ మద్ధతిస్తుంటామని తెలిపారు. తన కుమారులు ఇద్దరు సమాజ సేవ కోసం ఫౌండేషన్ ను స్థాపించి విద్యార్థులకు చేయుతనందించడం సంతోషంగా ఉందన్నారు.
చిన్న వయస్సుల్లోనే వాళ్ళు గొప్పగా ఆలోచించడం తల్లిగా తాను గర్వపడుతున్నానని అన్నారు. భవిష్యత్తులోనూ ఫౌండేషన్ ద్వారా మరిన్ని  కార్యక్రమాలు చేపట్టి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. స్కాలర్ షిప్ అందుకున్న విద్యార్థులకు కవిత అభినందనలు తెలిపారు. ఉన్నత చదువులలో బాగా రాణించి, ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.
SRPT: జిల్లాలో ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల నిధులు: సీఎం కేసీఆర్
సూర్యాపేట: జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, సమీకృత వ్యవసాయ మార్కెట్, మెడికల్ కాలేజ్, బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభలో  మాట్లాడుతూ..సూర్యాపేట చాలాబాగా అభివృద్ధి చెందిందని, రూ.100 కోట్లతో పరిపాలన భవనాలు నిర్మించుకున్నామని, మానవభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణం అని అన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నాం అని తెలిపారు. ఇంత అద్భుత కలెక్టరేట్లు, పోలీస్ భవనాలు ఎక్కడా లేవని, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కూడా మన కలెక్టరేట్ల వలే లేవు అని అన్నారు. రిజిస్ట్రేషన్లు మండలాలలోని 15 నిమిషాల్లోనే పూర్తి అయ్యేలా ధరణి తీసుకొచ్చామన్నారు. ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా రైతుబంధు, రైతుబీమా  డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో పడుతుందని చెప్పారు. ధరణి తీసిస్తే రైతుబంధు, రైతుబీమా ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. పైరవీకారుల చుట్టూ రైతులు తిరగవద్దనే ధరణి తీసుకువచ్చామని వివరించారు. కుల వృత్తులు చేసుకునే బీసీ బిడ్డలకు రూ.లక్ష చొప్పున ఇస్తున్నామని వివరించారు. కాళేశ్వరం జలాలు 480 కి.మీ. ప్రయాణించి సూర్యాపేట జిల్లాలోకి వస్తున్నాయని తెలిపారు.

జిల్లాలో ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల నిధులు ఇస్తామన్నారు. కళాభారతి నిర్మాణానికి రూ. 25 కోట్లు మంజురు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు కేటాయించామన్నారు. సూర్యాపేట అద్భుత ప్రగతితో దూసుకుపోతోందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.