ఇవ్వాళ రేపు రాష్ట్రంలో వర్ష సూచన
తెలంగాణలో బండలు పగిలేలా ఎండలు మండిపోతున్నాయి. బయటికి వస్తే భగభగలాడిస్తోన్న ఎండలతో.. ఇంట్లో ఉంటే చెమలు కారిపోయి ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. వాతావరణ శాఖ చల్లటి కబురు వినిపించింది. భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం కలింగించేలా వర్ష సూచన ఉందంటూ.. కూల్ కూల్ న్యూస్ అందించింది. అయితే.. ఇవాళ, రేపు కొంత పొడి వాతావరణం నెలకొంటుందని.. ఎల్లుండి మాత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇవాళ, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం
ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్ష సూచన
తెలంగాణలో గత వారం రోజులుగా భానుడు నిప్పులు కురిపిస్తూ.. తన ప్రతాపం చూపిస్తున్నాడు. భగభగా మండిపోతున్న ఎండలతో బయటికి రావాలంటేనే భయపడుతోన్న పరిస్థితి నెలకొంది. అయితే.. ఇలాంటి సమయంలోనే.. వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఓవైపు ఎండలు.. మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలకు ఉపశమనం కలిగించే కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పిన వాతావరణ శాఖ.. ఎల్లుండి మాత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కరిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అందులోనూ.. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ అంచనా గనుక నిజమైనట్టయితే.. రాష్ట్ర ప్రజలకు మండుతోన్న ఎండల నుంచి కొంత ఉపశమనం దొరికే అవకాశం ఉంది.
Aug 21 2023, 10:33