NLG: ఏఎన్ఎం బాధలు తీర్చండి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్గొండ: ఏఐటియుసి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న, 2వ ఏఎన్ఎం లు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ ముందు చేపట్టిన నిరవధిక సమ్మె నేడు నాల్గవ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఏఎన్ఎం ల పట్ల కనికరం చూపక పోవటం అన్యాయమని, గత16 ఏళ్లుగా రెండవ ఏఎన్ఎంలు నిర్విరామమంగా ఆరోగ్యవంతమైన సమాజం తయారు చేయడం కోసం పనిచేస్తున్నారని అన్నారు.
అలాంటి వారిని మళ్లీ పరీక్ష రాసి ఉద్యోగం సాధించుకోవాలని చెప్పడం అన్యాయమని, ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎం లందరిని బే షరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
కరోనా వంటి కష్టకాలంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తమ ప్రాణాలను పణంగా పెట్టి, ప్రజలకు సేవలందించారు. వారిని కాదని 1520 మంది ఏఎన్ఎం లను కొత్తగా నియమించేందుకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇది అన్యాయమని, నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలన్నారు.
ఏఎన్ఎం ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి సరికాదన్నారు. ఐక్యంగా పోరాడితే ప్రభుత్వం దిగిరాక తప్పదు అన్నారు. ఒక్కొక్క ఏఎన్ఎం 36 రిజిస్టర్లు ఆన్లైన్ మరియు అఫ్ లైన్ లో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆరోగ్య వంతమైన సమాజాన్ని తయారు చేస్తున్న ఏఎన్ఎం లను పట్టించుకోక పోవటం అన్యాయం అని అన్నారు.
యూనిఫాం అలవెన్స్ కూడా ఇవ్వటం లేదు. ప్రభుత్వం టాబ్ లు ఇచ్చినా, నెట్ బాలెన్స్ ఇవ్వటం లేదని అన్నారు. ఆరు నుండి పది వేల మంది జనాభాకు ఒక్క ఏఎన్ఎం పనిచేస్తుందని, ఎక్కడికి వెళ్ళినా టిఎ ,డిఎ లు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రెండవ ఏఎన్ఎం ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రత్నకుమారి, జిల్లా కార్యదర్శి నర్సమ్మ, పద్మ, నాగమణి, వసంత, సుశీల, గీత, భూదేవి, లత, సైదమ్మ, రేణుక, సరిత, గాయత్రి, సత్యమ్మ, విజయసుధ, నిర్మల, లత, కౌసల్య, పార్వతి, సులోచన, సాలమ్మ, గీత, నీలవేణి, లక్ష్మమ్మ, జ్యోతి, శారద, పుష్ప, విజయలక్ష్మి, చంద్రకళ, రజిత, రెహానా, అనిత, సుప్రియ, నాగలక్ష్మి మాధురి, సుచిత్ర, తదితరులు పాల్గొన్నారు.
Aug 20 2023, 22:37