NLG: రెగ్యులర్ చేయాలని నిరవధిక సమ్మె చేపట్టిన సెకండ్ ఏఎన్ఎంలు
నల్లగొండ: జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో.. జిల్లాలో ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంలు, తమను రెగ్యులరైజ్ చేయాలని నేటి నుండి నిరవధిక సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సెకండ్ ఏఎన్ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు బి. నాగమణి మాట్లాడుతూ... గత 16 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని గతంలో పలుమార్లు నిరసనలు వ్యక్తం చేసి ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాం. కానీ నేటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏఐటియూసి ఆధ్వర్యంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని నేడు నిరవదిక సమ్మె చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం లను ఎక్కడివారిని అక్కడే రెగ్యులర్ చేయాలని, నోటిఫికేషన్ ను రద్దు చేయాలని, ఎగ్జామ్ లేకుండా భేషరతుగా తమ ను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సెకండ్ ఏఎన్ఎం లు పద్మ ,అనురాధ, సుచిత్ర, రోజా, మంజుల, సరిత, స్వప్న, మమత, రాములమ్మ, సుమలత, అరుణ, హారతి ,అండాల, జానకి తదితరులు పాల్గొన్నారు.
Aug 16 2023, 20:04