కామ్రేడ్ రాగిరెడ్డి వీరారెడ్డి కి జోహార్లు: బుడిగ వెంకటేష్
దేవరకొండ: ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమ యువకిశోరం కామ్రేడ్ రాగిరెడ్డి వీరారెడ్డి 42వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. మనకు స్వాతంత్రం వచ్చిన రోజునే అమర జీవి రాగిరెడ్డి వీరారెడ్డి, పేదల భూముల కోసం రాయినిపాలెం గ్రామంలో అసువులు బబాసిన వీరుడు అని అన్నారు. చిన్నతనం నుండి ఆయన విద్యార్థి సమస్యలు పరిష్కరించబడాలని, వసతి గృహాలలో సరైన వసతి సౌకర్యాలు కావాలని, విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలని ఎస్ఎఫ్ఐలో చాలా తీవ్ర స్థాయిలో కృషి చేసిన్నారని తెలిపారు. విద్యార్థి ఉద్యమాల వేగు చుక్క వీరారెడ్డి ఎస్ఎఫ్ఐ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మిర్యాలగూడ డివిజన్ లో బలమైన విద్యార్థి ఉద్యమాలు చేపట్టారని, ఆ తర్వాత రాయినిపాలెం గ్రామంలో మిగులు భూములు, గ్రామంలో ఉన్న పేదలకు చెందాలని ఆ పేదల కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించారని, మిగులు భూములలోనే అసువులు బాసిన ధీరుడు అని అన్నారు. ఎర్రజెండాకు వన్నె తెచ్చి మిర్యాలగూడ డివిజన్లో ఉద్యమాన్ని అభివృద్ధి చేయడంలో ఎన్నో విధాలుగా కృషి చేసిన వ్యక్తి వీరారెడ్డి అని, ఆ అమరుడికి జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలను సాధించడం కోసం ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కుర్ర రాహుల్, కిరణ్, హేమంత్, గణేష్, రాజేష్, శ్రవణ్, హేమ శంకర్, హరీష్, అఖల్, తదితరులు పాల్గొన్నారు
Aug 15 2023, 22:16