ప్రైవేటు పాఠశాలలలో ఫీజుల దోపిడి ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
బి సి యువజన సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్
తెలంగాణ రాష్ట్రంలో విద్య పూర్తిగా వ్యాపారంగా మారిందని మిర్యాలగూడలో అమరవీరుల స్తూపం దగ్గర నిరసన తెలియజేస్తూ మాట్లాడుతున్న బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ
ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వలన విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున విద్యా వ్యాపారం నడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన పాఠశాల యాజమాన్యాల ఫీజులకు అంతే లేకుండా పోయింది.
ఒక L K G విద్యార్థికే 40 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు అలాంటి విద్యా సంస్థలపై నేటికీ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయింది పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునేందుకు వీలు లేకుండా ఈ ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడిని ప్రభుత్వం అరికట్టకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు.
ప్రైవేటు పాఠశాలలను నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ యూనిఫామ్ బుక్స్ ఇలా అన్ని ప్రైవేట్ వాళ్ళ పాఠశాలలోనే తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడికి గురి చేస్తున్నాను విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుండి తల్లిదండ్రులను విద్యార్థుల ఫీజుల పట్ల నేటికి తీవ్ర ఆందోళన కొనసాగుతూ ఉంది విద్యని వ్యాపారంగా చేసి విద్యని అమ్ముకుంటున్న విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోతే మాత్రం పాఠశాలల ఎదుట తీవ్రస్థాయిలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.
ఇకనైనా ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలకు వత్తాసుగా ఉండకుండా పేదల పక్షపాతిగా ప్రతి పేద విద్యార్థి ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విధంగా ప్రభుత్వం ఫీజ్ స్ట్రక్చర్ నియమించి పేద విద్యార్థులందరికీ విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్లపూడి శీను, అజయ్, గంగాధర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Jun 15 2023, 13:22