మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తాం
- మైనర్లు వాహనాలు నడిపితే రోడ్డుపై జరిగే ప్రమాదాలకు తల్లిదండ్రులదే బాధ్యత
- నల్లగొండ టూ టౌన్ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
మైనర్లకు వాహనాలు ఇస్తే బండి యజమానులపై కేసులు నమోదు చేస్తామని నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు.
బుధవారం రాత్రి నల్లగొండ పట్టణంలోని రామగిరిలో జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మైనర్లు నడుపుతున్న 20 వాహనాలను పట్టుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపడం మూలంగా రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయక ప్రజలు మరణిస్తున్నారన్నారు.
మైనర్లు వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలకు తల్లిదండ్రుల బాధ్యత వహించాలని అన్నారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా లైసెన్స్ తీసుకొని వాహనాలు నడపాలన్నారు. లైసెన్స్ లేకుండా, నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బుధవారం 34 కేసులు నమోదు చేసి రూ. 20 వేల జరిమానా విధించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు సంపత్, జూకూరు సైదులు, సిబ్బంది నరసింహ, ధార లింగస్వామి, వెంకన్న, అనిల్ పాల్గొన్నారు.
Jun 14 2023, 21:39