/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Tamil Nadu: ఈడీ అరెస్టు.. ఆసుపత్రిలో ఏడ్చేసిన మంత్రి Yadagiri Goud
Tamil Nadu: ఈడీ అరెస్టు.. ఆసుపత్రిలో ఏడ్చేసిన మంత్రి

చెన్నై: మనీలాండరింగ్‌ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి, డీఎంకే నేత వి.సెంథిల్‌ బాలాజీ (Senthil Balaji)ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) అధికారులు అరెస్టు చేశారు..

మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంతో పాటు చెన్నైలోని నివాసంలో సుదీర్ఘంగా సోదాలు (Raids) చేపట్టిన ఈడీ అధికారులు.. అర్ధరాత్రి తర్వాత మంత్రిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల పాటు ప్రశ్నించిన తర్వాత బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షల నిమిత్తం సెంథిల్‌ను చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

అయితే, అప్పటికే అనారోగ్యంతో ఉన్న మంత్రి.. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయంలో ఛాతీ నొప్పి తట్టుకోలేక ఏడ్చేశారు. కారు నుంచి కిందికి దిగే క్రమంలో తీవ్రంగా విలపించిన సెంథిల్‌ బాలాజీ (Senthil Balaji)ని పోలీసులు బలవంతంగా ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. ఈడీ విచారణ సమయంలో మంత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని DMK రాజ్యసభ సభ్యుడు ఎన్‌.ఆర్‌. ఇలంగో చెప్పారు. ప్రస్తుతం సెంథిల్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు..

అమిత్ "షా రొస్తున్నారు!!

హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

చూద్దాం సై.. చేద్దాం సై

బీజేపీ శ్రేణుల్లో హుషారు నింపే యత్నం

రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో రేపు సమావేశం

భద్రాచలం క్షేత్రంలో సీతారాముల దర్శనం

ఖమ్మంలో బహిరంగసభ.. ఎన్టీఆర్‌కు నివాళి

తెలంగాణలో అధికారం దిశగా పార్టీని నడిపేలా.. బీజేపీ కార్యకర్తలు, శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిస్తూ అమిత్‌ షా పర్యటన సాగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బుధవారం అర్ధరాత్రి సమయానికి హైదరాబాద్‌కు చేరుకోనున్న షా.. గురువారం రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై పలు అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని, శ్రేణులను వార్‌ మోడ్‌లో పెడతారని భావిస్తున్నారు. ముఖ్యంగా.. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మిగిలింది ఐదారు నెలల స్వల్ప సమయమేనని, ఈ సమయంలోగా పార్టీ పుంజుకుని మళ్లీ మునుపటిలాగా బీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం తామేనన్న అభిప్రాయం ప్రజల్లో తేవాలంటే ఎలా దూకుడుగా వ్యవహరించాలి? సూక్ష్మస్థాయిలో ఏయే వ్యూహాలను రచించి పాటించాలి? వంటి అంశాలపై పార్టీ నేతలకు ఆయన సూచిస్తారని సమాచారం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పు అంశం పార్టీలో కలకలం రేపుతున్న నేపథ్యంలో.. అమిత్‌ షా ఆ అంశంపై కూడా పార్టీ శ్రేణులకు ఒక స్పష్టతనిస్తారని భావిస్తున్నారు. ఒకవేళ పార్టీ నాయకత్వాన్ని మార్చాలని భావిస్తే.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో కూడా వివరించి, ఒప్పిస్తారని అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జుల మధ్య సమన్వయలోపం కూడా తెలంగాణలో పార్టీ ఎదుగుదలకు శాపంగా మారిందన్న అభిప్రాయం ఉంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న సునీల్‌ బన్సల్‌, తరుణ్‌ఛుగ్‌తో పాటు.. సంస్థాగత పార్టీ అగ్రనేత శివప్రకాశ్‌, మరో సీనియర్‌ నేత అర్వింద్‌ మీనన్‌ రాష్ట్ర బీజేపీకి ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. వీరి మధ్య సమన్వయం లేదన్న ప్రచారంపార్టీవర్గాల్లో జరుగుతోంది. దీంతోపాటు పలువురు సీనియర్‌ నేతల మధ్య కొరవడిన సఖ్యత... కొత్త, పాత నేతల మధ్య అపోహలు.. కొంతమంది అసమ్మతి నేతల రహస్య భేటీలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇతరపార్టీల నుంచి వచ్చిన నేతల నడుమ విభేదాలు.. ఒకరికి ప్రాధాన్యమిస్తే మరొకరు ఆగ్రహం చెందడం.. ఒకరికి పార్టీ పదవి ఇస్తే మరొకరు వ్యతిరేకించడం వంటి చర్యలు పార్టీ దూకుడును ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి వేసినట్లుగా మారుస్తున్నాయన్న వాదన ఉంది. ఫలితంగా జాతీయ నాయకత్వం నిర్దేశిస్తున్న కార్యక్రమాలను పలుచోట్ల తూతూమంత్రంగా కొనసాగిస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి పార్టీ దూకుడు పెంచడానికి ఆట్టే సమయం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ భవితవ్యం అమిత్‌ షా పర్యటనపైనే ఆధారపడి ఉందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతోపాటు.. పార్టీకి పట్టులేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమిత్‌షా తొలిసారిగా బహిరంగసభలో పాల్గొంటున్న దృష్ట్యా, ఆ జిల్లాలో ఎలాంటి సమీకరణాలకు తెరలేవబోతోందన్నది కూడా రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

వరుస భేటీలు

అమిత్‌షా బుధవారం రాత్రి 11.55 గంటలకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రికి శంషాబాద్‌ నొవాటెల్‌లో బస చేస్తారు. గురువారం ఉదయం రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో, ఆ తర్వాత ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళితో మణికొండలో సమావేశమవుతారు. 12.45 గంటలకు శంషాబాద్‌లోని జేడీ కన్వెన్షన్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకులతో, కేడర్‌తో గంటంబావు పాటు విందు సమావేశంలో గడుపుతారు. 2.25 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి భద్రాచలం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు రాములవారిని దర్శించుకున్న తర్వాత.. 5 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా.. 5.40 గంటలకు ఖమ్మంలోని ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారు. 6 గంటలకు పార్టీ బహిరంగసభలో పాల్గొన్న అనంతరం.. 7.10కి గెస్ట్‌హౌ్‌సలో విశ్రాంతి తీసుకుంటారు. 7.40 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కణ్నుంచీ 8.15 గంటలకు ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ వెళతారు...

తిరుమలలోకొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి :జూన్ 14

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు బుధవారం టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,227 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,706 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....

SB NEWS

2 వేల నోటు.. మద్యం షాపుల ద్వారా భారీ దందా❓️

నేతల ఇళ్ల కలుగుల్లోంచి బయటికొస్తున్న నోట్లు

రోజు అమ్మే మద్యం అమ్మకాల్లో 80 కోట్లలో సగం 2 వేల నోట్లే!

రాష్ట్రంలో ఒక్కో మద్యం షాపులో సగటున రోజుకు రూ.2లక్షల వ్యాపారం జరుగుతోంది. ఇందులో దాదాపు సగం అంటే రూ.లక్ష.. రూ.2 వేల నోట్లే వచ్చాయంటూ బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. రూ.2 వేల నోట్లను వ్యక్తిగతంగా బ్యాంకుకు వెళ్లి మార్చుకోవాలంటే రూ.20 వేల పరిమితి ఉంది. అదే మద్యం షాపు ద్వారా అయితే అపరిమితంగా నోట్లు మార్చుకోవచ్చు. మద్యంషాపుల నుంచి వచ్చే నోట్లను బ్యాంకులు తిరస్కరించలేవు. కానీ గత కొద్ది రోజుల నుంచి మద్యం షాపుల నుంచి వస్తున్న నోట్లను చూస్తుంటే బ్యాంక్‌ మేనేజర్లలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల పెద్ద నోట్లు వద్దని చెబుతున్నట్లు తెలిసింది.

షాపులే మార్పిడి కేంద్రాలు...

గత రెండు మూడేళ్ల నుంచి రూ.2వేల నోట్లు దాదాపుగా కనుమరుగయ్యాయి. బ్యాంకులకు వెళ్లిన నోట్లను ఆర్‌బీఐ తీసుకుని, వాటి స్థానంలో ఇతర చిన్న నోట్లు ముద్రించింది. దీంతో దాదాపుగా రూ.2వేల నోట్లు లేవనే అందరూ భావించారు. గత నెల 19న ఆ నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించగానే అనూహ్యంగా ఇప్పటివరకూ కనిపించకుండా పోయిన గులాబీ నోట్లు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలంటే రూ.20వేల పరిమితి ఉంది. ఒకేసారి రూ.50వేలు దాటి జమచేస్తే పాన్‌ నంబరు ఇవ్వాలి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన రాజకీయ నేతలు... మద్యం షాపులను ఎంచుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోని 2934 మద్యం షాపులు ప్రభుత్వ అధీనంలో నడుస్తున్నాయి. అక్కడ పనిచేసే సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్లు అంతా అధికార పార్టీకి సన్నిహితులే. రాష్ట్రంలో రోజుకు రూ.80కోట్ల మద్యం వ్యాపారం సాగుతుంటే అందులో దాదాపు రూ.60కోట్లు ఈ షాపుల్లోనే జరుగుతోంది. ఇప్పుడు ఆ నగదులో ఎక్కువగా గులాబీ నోట్లే కనిపిస్తున్నాయి.

ఎలా చేస్తున్నారు?

ప్రభుత్వ మద్యం షాపుల్లో రోజుకు రూ.లక్షన్నర నుంచి రూ.3లక్షల అమ్మకాలుంటాయి. అందులో రూ.2వేల నోట్లను చేర్చేందుకు పలు మార్గాలను ఎంపిక చేసుకున్నారు. తొలుత కొందరు నాయకులు వారి డ్రైవర్లు, అటెండర్లకు పెద్ద నోట్లు ఇచ్చి మద్యం కొనుగోళ్ల ద్వారా మార్పించే ప్రయత్నాలు చేశారు. అయితే ఒకట్రెండు రోజుల తర్వాత....ఇలా చేస్తే సెప్టెంబరు నాటికి మొత్తం నోట్లు మార్చడం సాధ్యపడదని తేలిపోయింది. దీంతో ఒకేసారి నోట్లు మార్చుకునేలా షాపుల్లోని సూపర్‌వైజర్లతో డీల్‌ మాట్లాడారు. ఎలాగూ మనోళ్లే కావడం, మరీ కాదంటే ఎంతోకొంత కమీషన్‌ ఇచ్చి అయినా నోట్లు మార్చేలా సెట్‌ చేశారు. వాస్తవానికి షాపుల్లో సామాన్య వినియోగదారులు రూ.2వేల నోటు ఇస్తే తీసుకోవడం లేదు. కనీసం రూ.వెయ్యికి పైగా కొనుగోలు చేస్తేనే అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో మందు తాగేవాళ్లలో ఎవరూ రూ.వెయ్యి కొనుగోళ్లు చేయరు. అలాంటప్పుడు ఇన్ని పెద్ద నోట్లు షాపులకు ఎలా వస్తున్నాయి? అంటే డీల్‌ సెట్‌ చేసుకున్న వారు రోజూ ఉదయం సూపర్‌వైజర్లకు మార్చాల్సిన నోట్లు ఇస్తారు. అనంతరం ఆ మేరకు వ్యాపారం జరిగాక ఫోన్‌ చేయగానే నేతల మనుషులు వచ్చి వాటిని తీసుకెళ్తారు. మరికొన్ని చోట్ల రోజంతా వ్యాపారం సాగుతుంది. తర్వాత రోజు ఉదయం ఆ నగదును బ్యాంక్‌లో జమ చేసే సమయంలో చిన్న నోట్ల స్థానంలో రూ.2వేల నోట్లు పెడుతున్నారు. మరికొందరు చోటా నేతలు బెల్టు షాపుల కోసం పెద్దఎత్తున కొనుగోలు చేసే మద్యాన్ని పూర్తిగా రూ.2వేల నోట్లతోనే కొంటున్నారు.

పెట్రోల్‌ బంకుల్లోనూ...

మద్యం షాపుల్లో అమ్మే రూ.60 కోట్లలో దాదాపుగా రూ.40 కోట్లు పెద్దనోట్లేనని తెలిసింది. ఇవి కాకుండా కొందరు పెట్రోల్‌ బంకులను నోట్ల మార్పిడికి కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. రూ.10కోట్ల మేర మార్చేస్తున్నారు. వెరసి..ఒక్క రోజులోనే .50కోట్లు విలువైన పెద్ద నోట్లను చిన్న నోట్లుగా మార్చుకుంటున్నారు. ఇలా నెలలో 1500కోట్ల వరకు మార్చేఅవకాశం ఉంది..........

ఐదేళ్ల బాలికపై యువకుడు హత్యాచారం

ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు! గమనించిన స్థానికులు పట్టుకోబోగా పాపను చంపేస్తానని బెదిరించాడు. ఆపై ఓ బండరాయితో చిన్నారి తల, కన్నుపై భాగంలో గట్టిగా కొట్టాడు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి! హైదరాబాద్‌ నల్లకుంటలో మంగళవారం సాయంత్రం ఈ దారుణం జరిగింది.

బాలిక తల్లి, పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని రాయలసీమకు చెందిన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉన్నారు. భర్త, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యాపిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో జీవనోపాధికోసం ఆమె తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకొని హైదరాబాద్‌లోని కాచిగూడకు చేరుకుంది. అక్కడి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులను యాచిస్తూ వచ్చిన చిల్లర డబ్బులతో తన పిల్లలను పోషించుకుంటోంది.

మంగళవారం ఉదయం 10 గంటలకు రైల్వే స్టేషన్‌లో ఉండగా పెద్ద కుమార్తె అయిన ఐదేళ్ల బాలిక మంచినీళ్లు తెచ్చేందుకు స్టేషన్‌లోని నల్లా వద్దకు బాటిల్‌ తీసుకుని వెళ్లింది.

వెళ్లిన చిన్నారి ఆరగంట గడిచినా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి.. కుళాయి వద్దకు వెళ్లి చూడగా అక్కడ కుమార్తె కనిపించలేదు. పాపను ఓ యువకుడు ఎత్తుకొని వెళ్లాడం తాను చూశానంటూ ఆమెకు ఓ వ్యక్తి చెప్పడంతో వెంటనే కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ ఫుటేజీలు చూడగా బాలికను 25-30 ఏళ్ల యువకుడు ఎత్తుకొని పోతున్నట్లు కనిపించింది.

పాపను ఆ యువకుడు నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి ఎదురుగా ఉన్న నాలుగో వీధికి తీసుకెళ్లి రెండు వాహనాల మధ్య ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. పాప బిగ్గరగా రోదించడంతో స్థానికులు గమనించి అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. తనను పట్టుకుంటే పాపను చంపుతానని, ఓ బండ రాయితో చిన్నారి తల, ఎడమ కన్నుపై గట్టిగా కొట్టాడు. దీంతో పాపకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్థలికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పాపను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేశారు...

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, సిబ్బంది ఇళ్లలో ఐటీ దాడులు, 70 బృందాలతో తనిఖీలు..

హైదరాబాద్ : బుధవారం ఉదయంనుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, సిబ్బంది ఇళ్లలో ఐటీ సోదాలు.. నిర్వహిస్తోంది. మొత్తం 70 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.

ఈ సోదాలు మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అనేక కంపెనీల్లో బినామీగా ఉన్నాడని.. 15 కంపెనీల్లో పెట్టుబడిదారుగా ఉన్నారని అంటున్నారు.

ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

SB NEWS

Earthquake:| జమ్ముకశ్మీర్‌లోని కత్రా ప్రాంతంలో భూకంపం..

ఉత్తర భారతాన్ని భూకంపం భయపెడుతోంది. మంగళవారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భూ కంపం సంభవించింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, పంజాబ్, చంఢీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టు భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది..

సుందరమైన జమ్ముకశ్మీర్‌లోని ప్రజలు వరుస భూకంపాలతో బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా రెండు రోజుల నుంచి కశ్మీర్‌లో భూకంపాలు వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయకంపితులవుతున్నారు.

జమ్ముకశ్మీర్‌లో మంగళవారం దోడా ప్రాంతంలో భూకంపం సంభవించగా, బుధవారం తెల్లవారుజామున కత్రాకు దగ్గరలో భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు కత్రాలో భూకంపం వచ్చింది.

దీని తీవ్రత రెక్టర్‌ స్కేల్‌పై 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం కత్రాకు 81 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 లోతులో ప్రకంపనలు సంభవించినట్టు ఎన్‌సీఎస్‌ పేర్కొంది..

4 వారాలు ఆలస్యంగా తెలంగాణలోకి రుతుపవనాలు..

Monsoon: దేశంలోకి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న లేదు రెండుమూడు రోజుల తేడాతో ప్రవేశిస్తాయి. అయితే, ఈ ఏడాది వారం ఆలస్యంగా కేరళను రుతుపవనాలు తాకాయి..

బంగాళాఖాతంలోని వాతావరణ వ్యవస్థలు రుతుపవనాల ప్రధాన చోదకాలుగా భావిస్తారు. బంగాళాఖాతంలో ఇలాంటి వ్యవస్థ ఇప్పట్లో ఏర్పడే అవకాశం లేదు. కాబట్టి దేశంలోని చాలా ప్రాంతాలకు ఈ ఏడాది రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించే అవకాశముందని వాతావరణ నివేదికలు, వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తెలంగాణకు సైతం రుతుపవనాలు ఆలస్యంగా చేరుకుంటాయని నివేదికలు చెబుతున్నాయి.

తెలంగాణలో రుతుపవనాల రాక దాదాపు నాలుగు వారాలు ఆలస్యమవుతుందని ప్రయివేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఒక నివేదికలో తెలిపింది. బంగాళాఖాతంలోని వాతావరణ వ్యవస్థలు రుతుపవనాల ప్రధాన చోదకాలుగా భావిస్తారు. బంగాళాఖాతంలో ఇలాంటి వ్యవస్థ ఇప్పట్లో ఆవిర్భవించే అవకాశం లేకపోలేదని నివేదిక పేర్కొంది. "స్కైమెట్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ ప్రిడిక్షన్ సిస్టమ్ (ERPS) జూన్ 09, జూలై 06 మధ్య వచ్చే 4 వారాలపాటు దుర్భరమైన దృక్పథాన్ని అంచనా వేస్తోంది" అని వాతావరణ సూచన నివేదిక తెలిపింది..

మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కోర్ మాన్‌సూన్ జోన్‌లు తప్పనిసరిగా రుతుపవనాల వర్షాలు అవసరమని నివేదిక పేర్కొంది. స్కైమెట్ నుండి వచ్చిన నాలుగు వారాల అంచనా మ్యాప్ ఈ కాలంలో రాష్ట్రంలోని చాలా భాగం మితమైన పొడి నుండి చాలా పొడిగా ఉంటుందని అంచనా వేసింది. అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుఫాను అభివృద్ధి చెందుతుండటంతో నైరుతి రుతుపవనాల నిరీక్షణ భారత్ కు మరికొంత కాలం ఉండవచ్చని గత వారం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

ప్రస్తుత ప్రభావాల కారణంగా జూన్ 15 వరకు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉన్నందున, సోమవారం, భారత వాతావరణ శాఖ (IMD) తెలంగాణలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. సాయంత్రం సమయంలో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు సైతం పడే అవకాశముందని తెలిపింది..

రేపట్నుంచి తెలంగాణ పది సప్లిమెంటరీ ఎగ్జామ్స్...!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం జూన్ 14 నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు 71,681 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు.

పది సప్లిమెంటరీ పరీక్షలకు 259 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. మొత్తం 2,800 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని చెప్పారు.

50 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పర్యవేక్షిస్తాయని ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు కూడా విడులైన సంగతి తెలిసిందే.

SB NEWS

Jammu Kashmir: సరిహద్దు దాటేందుకు యత్నించిన ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ..

జమ్మూ కాశ్మీర్ లో అలజడి రేపేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ కుయుక్తులు పన్నుతూనే ఉంది. భారత్-పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖను దాటించి ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నం చేస్తోంది..

ఇప్పటికే సరిహద్దును ఆనుకుని పాకిస్తాన్ వైపు ఉగ్రవాదలు లాంచింగ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. అదును దొరికితే వారిని భారత్ లోకి పంపేందుకు చూస్తోంది పాకిస్తాన్ ఆర్మీ. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు ఇద్దరు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారత్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తం అయిన భద్రతా బలగాలు ఉగ్రవాదులిద్దర్ని కాల్చి చంపేశాయి.

ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్ లో చోటు చేసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులను ఎల్ఓసీ వద్ద ఆర్మీ, కుప్వారా పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో హతమార్చినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. గత నెలలో శ్రీనగర్ లో జరిగిన జీ20 సమ్మిట్ ను భగ్నం చేసేందుకు ఇలాగే పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నం చేసింది.