TS News: ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్‌కు బాంబ్ బెదిరింపు.. పరుగులు తీసిన ఉద్యోగులు..
హైదరాబాద్: అది రద్దీగా ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయం (Income Tax Office). సోమవారం కావడంతో గతవారం పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు కొందరు అధికారులు పీజీలను శరవేగంతో తిరిగేస్తున్నారు..
మరి కొందరు అక్రమార్కుల చిట్టాను తయారు చేస్తున్నారు. ఇలా అధికారులు ఎవరి పనిలో వాళ్లు మునిగిపోయారు. ఇంతలోనే ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ రింగ్ మంటూ మోతమోగింది. పనిలో పడ్డ ఓ అధికారి ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. ఓ అంగతకుడు మీ ఆఫీస్‌లో బాంబు పెట్టామని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు.
క్షణాల్లో పిడుగు లాంటి వార్త దావాణంలా వ్యాపించింది. వార్త విన్న ఉద్యోగులు బతుకు జీవుడా అంటూ ఎక్కడ పనులక్కడ వదిలేసి బయటకు పరుగులు తీశారు. ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయం బాంబ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది.
ఇటీవల ఈ తరహా ఫోన్ కాల్స్ ఎక్కువవుతున్నాయి. రైల్వేస్టేషన్, బస్ స్టేషన్‌తో పాటు జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో బాంబు పెట్టామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ పోకిరీలు చివరకు స్కూళ్లను కూడా వదలం లేదు. అయితే ఫోన్ చేసిన వ్యక్తులను గుర్తించి వారిని శిక్షించనప్పటికే మార్పు రావడం లేదు. ఆటపట్టించేందుకు బెదిరింపు ఫోన్ చేయడం వల్ల ప్రజాధనం నిరుపయోగం అవుతోంది. ఇలాంటి కాల్స్ వల్ల పోలీసులు, అధికారులు అంతకుముందే నిర్ణయించుకున్న పనులు పెడింగ్ పడుతున్నాయి. అలాగే బాంబ్ బెదిరింపు వల్ల ఉద్యోగులు మానసిన ఆందోళనకు గురవుతున్నారు..
Jun 12 2023, 21:42