పండుగలా విద్యాకానుక.. మేనమామగా సంతోషిస్తున్నా: సీఎం జగన్..
పల్నాడు:వీళ్లు చిన్నారులు వీళ్లకు ఓటు హక్కు లేదు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది గతం. కానీ, ఇవాళ వాళ్ల జగన్ మామ ప్రభుత్వంలో విద్యాకానుక ఓ పండుగలా జరుగుతోంది..
ఒక ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ప్రజాప్రతినిధులందరూ పిల్లలతో కలిసి ఈ పండుగలో పాల్గొంటుడడం.. ఆ పిల్లల మేనమామగా సంతోషపడుతున్నా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. సోమవారం పల్నాడు జిల్లా క్రోసూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారాయన. ''పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. కిట్లలో మెరుగైన మార్పులు తెచ్చాం. ప్రతీ విద్యార్థికి మూడు జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్సులు అందిస్తున్నాం.
నోట్ బుక్స్, వర్క్ బుక్స, బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలతో పాటు బ్యాగు సైజులు పెంచాం. యూనిఫామ్ డిజైన్‌లోనూ మార్పులు చేశాం అని తెలిపారాయన.
ఈ ఒక్క పథకం మీదే ఈ నాలుగు ఏళ్లలో ఈ పిల్లల మేనమామ ప్రభుత్వం అక్షరాల రూ. 3,366 కోట్లు ఖర్చు చేశామని చెప్పడానికి గర్వపడతున్నాం అని సీఎం జగన్ చెప్పారు..
Jun 12 2023, 16:08