Cm Jagan: ఏపీలో నేడే జగనన్న విద్యాకానుక.. ప్రారంభించనున్న సీఎం జగన్..
ఏపీలో ఇవాళ్టి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ బడులకు వెళ్లే విద్యార్ధులకు అవసరమైన వస్తువులతో కూడిన విద్యా కానుక కిట్లను సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు..
2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాకానుక పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకుచదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు.
పల్నాడు జిల్లా పెద కూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు..
విద్యా కానుక కిట్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇంగ్లోష్-తెలుగులో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా ఇస్తారు.
దీంతో పాటు ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6-10 తరగతి పిల్లలకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, 1-5 తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన విద్యాకానుక కిట్ ను స్కూల్ ప్రారంభమైన తొలిరోజే అందిస్తున్నారు..
Jun 12 2023, 08:00